
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలకు సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారిన నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకపోయినా త్వరలోనే బైపోల్ ఉందన్నట్లుగా రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీయడంలో ఎప్పుడు ఏ లీడర్ ఏ పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఏ పార్టీ జెండా కప్పుకుంటారో తెలియని వాతావరణం నెలకొంది. మూడు రోజుల్లో ఆరుగురు సర్పంచ్ లు, ముగ్గురు ఎంపీటీసీలు కారెక్కడంతో అధికార పార్టీ జోరు మీదు ఉన్నట్లు కనిపించింది. కాని మంగళవారం సీన్ రివర్స్ అయింది.
Read More : తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా….
మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కీలక నేత, చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరారు. శామీర్ పేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరారు. తాడూరి వెంకట్ రెడ్డితో పాటు చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ చౌటుప్పల్ మాజీ మండల అధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డి, సీనియర్ నేత ఎడ్ల మహేందర్ రెడ్డి కమలం గూటికి చేరారు.ఈ నేతలకు కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఈటల రాజేందర్. ఈ నేతలంతో కొన్ని రోజులుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి గళం వినిపించారు. మంత్రి జగదీశ్ రెడ్డి పలుసార్లు మాట్లాడినా వెనక్కి తగ్గలేదు.ఇటీవల చౌటుప్పల్ మండలం ఆందోళ్ మైసమ్మ దగ్గర జరిగిన అసమ్మతి నేతల సమావేశంలో తాడూరి ఆధ్వర్యంలోనే జరిగింది.
Read More : కేసీఆర్ సభ రోజే మునుగోడుకు రేవంత్ రెడ్డి.. సమరానికి సై అంటున్న పీసీసీ చీఫ్
అసమ్మతి గళం వినిపించిన తాడూరిని కూల్ చేసేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రయత్నించినా సఫలం కాలేదు. దీంతో మరో అస్త్రంగా సంధించారు. అతనపై గతంలో ఉన్న ఫిర్యాదులను వెలికితీసి రెండు కేసులు పెట్టించారు .సోమవారం రాత్రి హైదరాబాద్ వనస్థలిపురం లో చౌటుప్పల్ MPP తాడూరి వెంకటరెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు చౌటుప్పల్ పోలీసులుఅసమ్మతి గళం వినిపిస్తున్నందునే తాడూరిపై పాత కేసులు తిరగతోడారని తాడూరి ఆరోపించారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారన్న సమాచారంతోనే అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. పోలీసుల ద్వారా తనను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఈటల రాజేందర్ సమక్షంలో కమలం గూటికి చేరారు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి. త్వరలోనే మరికొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతారని ఆయన చెప్పడం కలకలం రేపుతోంది.
Read More : కారెక్కుతున్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు.. మునుగోడులో ఖాళీ అవుతున్న కాంగ్రెస్
తాడూరి చెప్పినట్లు బీజేపీలో ఎవరెవరు చేరుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.TRS నుంచి 70మంది సర్పంచ్ లు, 3గురు జడ్పీటీసీ లు, 4గురు ఎంపీపీ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ జడ్పీటీసీ లు , మాజీ ఎంపీపీ లు, సుమారు 100వార్డు మెంబెర్స్ 500 మంది ప్రజా ప్రతినిధులు ఈనెల 21న చౌటుప్పల్ లో జరిగే కేంద్రమంత్రి అమిత్ షా సభలో బీజేపీలో చేరుతారని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు చెప్పినట్లు ఆ స్థాయిలో లేకున్నా చాలా మంది గులాబీ లీడర్లు కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఇద్దరు ముఖ్య ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరడం ఖాయమంటున్నారు. ఇటీవల చౌటుప్పల్ లో జరిగిన అసమ్మతి నేతల సమావేశంలో సదరు నేతలు కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు. చౌటుప్పల్ మండలం నుంచి వలసలు భారీగా ఉండనున్నాయని సమాచారం. కూసుకుంట్లపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న నాంపల్లి మండలానికి చెందిన నేతలు కోమటిరెడ్డి వెంట కమలం గూటికి చేరుతారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- బీసీ అభ్యర్థులకే ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వాలి ….
- రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన….
- మునుగోడులో మూడుసార్లు సీఎం బహిరంగ సభలు… ప్రతిష్టాత్మకంగా జనసమీకరణ
- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా.. మునుగోడు కాంగ్రెస్ నేతల్లో కలవరం
- మునుగోడులో కోమటిరెడ్డికి డిపాజిట్ కష్టమేనా? గులాబీ గూటికి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు..