
క్రైమ్ మిర్రర్, నారాయణపురం : మునుగోడు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ బీసీ నాయకులకు టికెట్లను ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బద్దుల శ్రీధర్ యాదవ్ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని బి కే ఫౌండేషన్ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మునుగోడు నియోజకవర్గ పరిధిలో బీసీ జనాభా 72 శాతానికి పైగా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన 12 అసెంబ్లీ ఎన్నికలలో బీసీలు కేవలం ఓటర్లుగానే మిగిలారని, తమలో ఒకరిని గెలిపించి చట్టసభలకు పంపించ లేకపోయారన్నారు.
Read Also : మునుగోడులో మూడుసార్లు సీఎం బహిరంగ సభలు… ప్రతిష్టాత్మకంగా జనసమీకరణ
ఇప్పటికైనా బీసీలు చైతన్యవంతులై, ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన పార్టీకి మద్దతు ప్రకటించి, బీసీ నేతను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని చెప్పారు. దేశం స్వాతంత్ర వజ్రోత్సవాలను జరుపుకుంటున్న ఈ తరుణంలో కూడా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభించకపోవడం అన్యాయమని, జనాభా దాబాషా ప్రకారం బీసీలు రాజ్యాధికారంలో వాటా దక్కించుకునే దిశగా అడుగులు వేయాలని బద్దుల శ్రీధర్ యాదవ్ అన్నారు. బీసీ రాజ్యాధికార సాధన సమితి మునుగోడు కన్వీనర్ మురళీకృష్ణ యాదవ్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు ఉప్పల వెంకటేష్ , చిలువేరు జంగయ్య, నల్లబోతు సురేష్ యాదవ్, దంటిక శివాజీ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన….
- తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా….
- కేసీఆర్ సభ రోజే మునుగోడుకు రేవంత్ రెడ్డి.. సమరానికి సై అంటున్న పీసీసీ చీఫ్
- కారెక్కుతున్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు.. మునుగోడులో ఖాళీ అవుతున్న కాంగ్రెస్
- బుద్ధ మహా సమ్మేళనం, రానున్న మినిస్టర్లు….