
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అధికారం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక చావోరేవో అన్నట్లుగా తయారైంది. మునుగోడులో విఫలమయితే ఆ ప్రభావం ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ గా తీసుకున్నారు. ఇప్పటికే చండూరులో సభ నిర్వహించిన రేవంత్.. కొవిడ్ సోకడంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారుయ. ఈనెల నుంచి మునుగోడు నియోజకవర్గంలోనే ఉంటానని ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డికి స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచే సమస్యలు వస్తున్నాయి . కోమటిరెడ్డి చేస్తున్న కామెంట్లు పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయి. కేడర్ కూడా గందరగోళంలో పడుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Read More : బీసీకే మునుగోడు కాంగ్రెస్ టికెట్? అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ వెయిట్ అండ్ సీ పాలసీ…
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండటంతో వెంకట్ రెడ్డి ఖచ్చితంగా తమ్ముడికే సపోర్ట్ చేస్తారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఇకపై ఆయనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయిందట. పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంటూ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు అద్దకి దయాకర్ చుండూరు సభలో కోమటిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. దాని మీద ఫైర్ అయిన కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. దానికి కొంత తగ్గి మరీ రేవంత్ రెడ్డి ఆయనకు సారీ చెప్పారు. ఇక అద్దంకి దయాకర్ కూడా సారీ చెప్పినా కోమటిరెడ్డి వినకుండా కాస్తా అతి చేస్తున్నారు అని అంటున్నారు.
ఈ విషయాలు అన్నీ కూడా హై కమాండ్ దృష్టిలోకి వెళ్లాయట. దాంతో హై కమాండ్ కూడా ఆయన్ని లైట్ తీసుకుంది అని అంటున్నారు. ఎటూ ఆయన తమ్ముడికే ఓటేస్తారు అని అనుమానిస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఆయన్ని అలా వదిలేయడమే బెటర్ అని అంటున్నారుట. మునుగోడులో పార్టీని గెలిపించే బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించకూడదని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.ఇక తనను పార్టీ నుంచి బయటకు పంపిస్తే భారీ సానుభూతి పొందాలని వెంకటరెడ్డి చూస్తున్నారుట. అయితే హై కమాండ్ మాత్రం అలా కాకుండా ఆయన్ని పార్టీలో ఉంచినా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుడా సైడ్ చేయలాని మరో ఎత్తు వేసిందని అంటున్నారు. దాంతో కోమటిరెడ్డికే చాయిస్ వదిలేసి ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో నీ ఇష్టం అన్న తరహాలో హై కమాండ్ వ్యవహరిస్తుంది అని చెబుతున్నారు. మొత్తానికి వెంకటరెడ్డి ఇపుడు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు. ఆయన ఏం చేస్తారో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి …
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
- మునుగోడులో కారు పంక్చరే! బీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎంపీపీ.. అదేబాటలో వంద
- రచ్చకెక్కిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గపోరు
- నిద్రిస్తున్న క్రైమ్ నిర్మూలన విభాగం.. అవినీతి పరులకు అండగా అధికారి హస్తం..
- కసితో మర్మాంగాలు కోసేశాడు.. అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్యల్లో సంచలనం….