
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): ఈ నెల 18న శివన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల గిరి నర్సింహా ఆధ్వర్యంలో నిర్వహించనున్న బుద్ధ భగవానుడి విగ్రహ ప్రతిష్ట, యోగా మందిరం శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లు హాజరు కానున్నారు. మునుగోడు బై ఎలక్షన్ నేపథ్యంలో ఈ కార్యక్రమం అధికార పార్టీకి కలిసొచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. గతంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు అయిదు వేల మంది హాజరయ్యారు. ఈ సారి ఇద్దరు మినిస్టర్ల రాకతో దాదాపు పదివేలకు పైగా పబ్లిక్ రావచ్చని అంచనా. మినిస్టర్ లతో పాటు పలువురు ముఖ్య నేతల రాక మండల పరిధిలో పండగ వాతావరణం కనపడేలా ఉంది. రెండు రోజుల క్రితమే మినిస్టర్ లు ఈ ప్రోగ్రామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బుద్ధుని విశిష్టత కూడా ప్రజల్లోకి వస్తుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మంత్రుల రాకతో బుద్ధ ప్రాంగణం అభివృద్ధిలోకి వస్తుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత….
- గోల్కొండ కోటపై కేసీఆర్ జెండా ఆవిష్కరణ….
- జాతీయ జెండాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోటోలు!!
- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా.. మునుగోడు కాంగ్రెస్ నేతల్లో కలవరం
- మునుగోడులో కోమటిరెడ్డికి డిపాజిట్ కష్టమేనా? గులాబీ గూటికి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు..