
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలోకి అడుగుపెట్టిన భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రతీకగా నేడు యావత్ భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జాతీయ జెండాలను ఎగురవేసి, దేశ స్వాతంత్రోద్యమ కాలాన్ని గుర్తు చేసుకోవాలని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలి అని, జాతీయ జెండాను గౌరవిస్తూ, ఆ స్ఫూర్తితో ముందుకు సాగాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
కొన్నిచోట్ల మితిమీరిన దేశభక్తితో చెయ్యకూడని పనులు చేస్తున్న వారు కూడా లేకపోలేదు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను అవమానించిన అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జెండాను తలకిందులుగా చేసి పట్టుకోవడం, జాతీయ జెండాలో గులాబీ రంగు మిక్స్ చేసి పోస్టర్లు వేయడం వంటి అనేక ఘటనలు మర్చిపోకముందే తాజాగా, జాతీయ జెండా పై ఎమ్మెల్యే ఫోటోను ముద్రించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Read Also : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా.. మునుగోడు కాంగ్రెస్ నేతల్లో కలవరం
కుత్బుల్లాపూర్ లోని పలు ప్రాంతాలలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఫొటోను ముద్రించి ఉన్న జాతీయ జెండాలను ఫ్లెక్సీలు, బ్యానర్లు గా కట్టారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా అభిమానులు ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఫ్లెక్సీలు ఇప్పుడు వివాదానికి కారణంగా మారాయి. జాతీయ జెండాలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఫోటోలు ముద్రించటం ఏమిటని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. కనీసం ఇది తప్పు అని కూడా తెలియదా అంటూ పెదవి విరుస్తున్నారు. ఇది జాతీయజెండాను అవమానించటం అని అంటున్నారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను అభిమానించే బొడ్డు రవికుమార్ అనే వ్యక్తి జాతీయ జెండాలపై ఓవైపు ఎమ్మెల్యే ఫోటోను, మరోవైపు తన ఫోటోను ముద్రించుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2002 నియమావళి ఉల్లంఘనగా తెలుస్తుంది. దీంతో సదరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన నాయకులపై చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన నాయకులతోపాటు, సదరు ఎమ్మెల్యే కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో కోమటిరెడ్డికి డిపాజిట్ కష్టమేనా? గులాబీ గూటికి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు..
- గోల్కొండ కోటపై కేసీఆర్ జెండా ఆవిష్కరణ….
- కూసుకుంట్లను తరిమికొడతామంటున్న జనం.. అసలేం జరిగింది?
- మునుగోడు ఉప ఎన్నిక… మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం
- బ్రాందీ షాపులో పనికి రాడు.. బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్..