
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగే సమయమిదేనని, రాష్ట్రవ్యాప్తగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికి అందించామని, రాష్ట్రం త్రివర్థ శోభితంగా విలసిల్లుతోందని చెప్పారు. ఎందరో మహానుభావులవల్లే ఈరోజు మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని, వారి పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, అహింసా మార్గంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామనే విషయాన్ని గుర్తుచేశారు. దేశం మొత్తానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని, ఎన్నో అపూర్వ విజయాలను సొంతంచేసుకుంటోందని, బలీయమైన ఆర్థికశక్తిగా రాష్ట్రం మారిందన్నారు.
Read Also : మునుగోడు రేస్ నుంచి కూసుకుంట్ల అవుట్? అభ్యర్థిని మునుగోడు సభలో ప్రకటించనున్న కేసీఆర్..
అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందిస్తున్నామని, సాగులో 11.6 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. గొర్రెల పెంపకంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామని, గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉందని, 11.1 వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నామని, దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా మారిందన్నారు.
భారత స్వాతంత్ర్యం కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్ర పోషించారని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అలావుద్దీన్, రాంజీ గోండు, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు తదితర యోధులు సాహసోపేతంగా చేసిన పోరాటం అనన్య సామాన్యమని, అది ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్ ను జాతిపిత గాంధీజీ సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల జీవనశైలిని గంగా జమునా తెహజీబ్ గా మహాత్మా అభివర్ణించారని, అది మన జాతి మొత్తానికి గర్వకారణమని కేసీఆర్ పేర్కొన్నారు.
- జాతీయ జెండాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫోటోలు!!
- మునుగోడులో కోమటిరెడ్డికి డిపాజిట్ కష్టమేనా? గులాబీ గూటికి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు..
- మునుగోడు సభలో అభ్యర్థి ప్రకటన లేనట్టే! ఇంచార్జ్ MLAల సర్వే తర్వాతే కేసీఆర్ నిర్ణయం…
- ఎంపీటీసీతో రహస్య మంతనాలు… ఫలించేనా..?
- కాళ్లావేళ్లా పడుతున్న కూసుకుంట్ల.. ముఖం మీదే చీదరిస్తున్న అసమ్మతి నేతలు!
2 Comments