
ఉప ఎన్నిక జరగబోతున్న మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచింది.కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే దిశగా మంత్రి జగదీష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. వారం రోజులుగా మునుగోడుపైనే ఫోకస్ చేసిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నేతలను ఒక్కొక్కరుగా కారెక్కిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీజేపీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరనున్న రాజగోపాల్ రెడ్డి.. తనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలను భారీగా తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి దూకుడుకు చెక్ పెట్టేలా మంత్రి జగదీశ్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు.
ఆదివారం ఇద్దరు ఎంపీటీసీలు మంత్రి జగదీశ్ రెడ్డి సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. నలుగురు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్ లు తెలంగాణ భవన్ లో కంచర్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. సోమవారం కూడా కారు పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగాయి. మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో TRS లో చేరారు మునుగోడ ఇండిపెండెంట్ ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు. నారాయణ పురం మండలం కొత్తగూడం గ్రామ సర్పంచ్ దోనూరు సుశీల, సీనియర్ నాయకుడు శేఖర్ రెడ్డి కూడా కారెక్కారు. చండూర్ మున్సిపాలిటీ
కో అప్షన్ మెంబర్ సయ్యద్ వహిద్మండలాల వారిగా ఇంచార్జ్ లుగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నారు. దీంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో అధికార పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయంటున్నారు.