
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు. తనతో పాటు వందలాది మంది నేతలను కమలం గూటికి రాజగోపాల్ రెడ్డి తీసుకువెళ్తారనే ప్రచారం సాగుతోంది. కాని ఇప్పటివరకు కాంగ్రెస్ కు చెందిన ఒక్క ప్రజా ప్రతినిధి కూడా కోమటిరెడ్డికి మద్దతుగా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ నేతలతో కోమటిరెడ్డి రహస్యంగా చర్చలు జరుపుతున్నారని.. అమిత్ షా సభ వరకు అంతా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతారని రాజగోపాల్ రెడ్డి అనుచురులు చెబుతూ వస్తున్నారు.
Read More : మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు 30 వేలు!
అయితే మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మంత్రి జగదీశ్ రెడ్డి చక్రం తిప్పుతుండటంతో అమిత్ షా సభ నాటికి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా బీజేపీలో చేరుతారని భావించిన కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీలు కారెక్కుతున్నారు. ఆదివారం ఇద్దరు ఎంపీటీసీలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ఎంపిటిసి సభ్యుడు బొలుగూరి లింగయ్య టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇక సంస్థాన్ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో గుడిమల్కాపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ గులాబీ గూటికి చేరారు. హైదరాబాదులోని ఎంపీటీసీ శనివారం రాత్రి రహస్య మంతనాలు జరిపారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా మంత్రితో ఉన్నారు. చర్చలు ఫలించడంతో ఆదివారం మంత్రి సమక్షంలో అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Read More : మునుగోడు టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీ నేతల డిమాండ్
కాంగ్రెస్ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం సాగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వాళ్లతో చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి. కాని రూట్ మార్చిన కాంగ్రెస్ ఎంపీటీసీ కారెక్కేశారు.త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయంటున్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీలు టీఆర్ఎస్ లో చేరడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకవుతున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు సభలో అభ్యర్థి ప్రకటన లేనట్టే! ఇంచార్జ్ MLAల సర్వే తర్వాతే కేసీఆర్ నిర్ణయం…
- ఎంపీటీసీతో రహస్య మంతనాలు… ఫలించేనా..?
- కాళ్లావేళ్లా పడుతున్న కూసుకుంట్ల.. ముఖం మీదే చీదరిస్తున్న అసమ్మతి నేతలు!
- రేస్ నుంచి కూసుకుంట్ల అవుట్? అభ్యర్థిని మునుగోడు సభలో ప్రకటించనున్న కేసీఆర్..
- కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ… దయాకర్ పై చర్యల తరువాత అలోచిస్తన్నన వెంకటరెడ్డి
- తుపాకి పేలుడు కేసులో తొమ్మిది మంది నిందితులు అరెస్ట్- జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి.
One Comment