
క్రైమ్ మిర్రర్, నల్గొండ : మునుగోడు ఉప ఎన్నిక విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రస్తుత ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఖరారైందని మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే అసమ్మతి తీవ్రంగా ఉండటంతో సీఎం కేసీఆర్ తన నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తోంది. అభ్యర్థి విషయంలో తొందరపడకూడదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే ఈనెల 20న మునుగోడులో నిర్వహించనున్న బహిరంగ సభను అభ్యర్థితో సంబంధం లేకుండా జరపనున్నారు. ఇందుకోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్. నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో సంబంధం లేకుండానే వీళ్లు మునుగోడు సభ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మండలాల వారీగా ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించింది టీఆర్ఎస్ అధిష్టానం.
Read More : మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి…
మునుగోడు మండలానికి మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి… చౌటుప్పల్ మున్సిపాలిటీకి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ను కేటాయించింది. చౌటుప్పల్ రూరల్ కు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.. మర్రిగూడ మండలానికి భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు కేసీఆర్. నాంపల్లి మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డిని నియమించింది. చండూరు మున్సిపాలిటీ బాధ్యతలు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్యకు అప్పగించింది. చండూరు రూరల్ మండలం నుంచి జనసమీకరణను నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, యాదాద్రి జిల్లా జెడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి చూడనున్నారు. నారాయణపురం మండలానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను ఇంచార్జ్ గా నియమించారు కేసీఆర్
Read More : ప్రియుడిని కిడ్నాప్ చేయించి పెళ్లి చేసుకున్న యువతి!
సీఎం కేసీఆర్ ఆదేశాలతో మునుగోడులో పర్యటిస్తూ ముఖ్యమంత్రి సభను సక్సెస్ చేసేందుకు నేతలు శ్రమిస్తున్నారు. కూసుకుంట్లను పక్కన పెట్టడంతో అసమ్మతి నేతలు కూడా కేసీఆర్ సభ కోసం ఉత్సాహంగా జనసమీకరణ చేస్తున్నారని అంటున్నారు.మండలాల వారీగా ఇంంచార్జులుగా నియమించబడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… సీఎం సభకు జన సమీకరణ చేస్తూనే అసమ్మతి నేతలతో చర్చలు జరుపుతున్నారు. అసమ్మతి నేతల అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు నివేదించనున్నారు. ఇంచార్జ్ ఎమ్మెల్యేల సర్వే ను తీసుకొని మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ లో ఈ ఐదు రోజులు కీలకంగా మారింది. ఇంచార్జ్ ఎమ్మెల్యేలు హైకమాండ్ కు ఎలాంటి నివేదిక ఇస్తారు.. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి…
- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా.. మునుగోడు కాంగ్రెస్ నేతల్లో కలవరం
- మునుగోడులో కోమటిరెడ్డికి డిపాజిట్ కష్టమేనా? గులాబీ గూటికి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు..
- ఎంపీటీసీతో రహస్య మంతనాలు… ఫలించేనా..?
- కాళ్లావేళ్లా పడుతున్న కూసుకుంట్ల.. ముఖం మీదే చీదరిస్తున్న అసమ్మతి నేతలు!
- మునుగోడు రేస్ నుంచి కూసుకుంట్ల అవుట్? అభ్యర్థిని మునుగోడు సభలో ప్రకటించనున్న కేసీఆర్..
One Comment