
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా తనకు కరోనా సోకినట్టు స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనను కలిసినవాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నికల సందర్బంగా గత కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు సొంతపార్టీ నేతల విమర్శల మధ్య తీవ్రమైన ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కరోనా సోకడంతో..వైద్యుని సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో వెళ్లారు. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు.
రేవంత్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో మునుగోడు కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉప ఎన్నిక విషయంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నారు. గంటలకొద్ది చర్చలు జరుపుతున్నారు. గురు, శుక్ర వారాల్లో గాంధీభవన్ లో మునుగోడు కాంగ్రెస్ నేతలతోనే రేవంత్ రెడ్డి నాన్ స్టాప్ చర్చలు జరిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ రావడంతో.. అతనిని కలిసిన నేతలంతా హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు సభలో అభ్యర్థి ప్రకటన లేనట్టే! ఇంచార్జ్ MLAల సర్వే తర్వాతే కేసీఆర్ నిర్ణయం…
- ఎంపీటీసీతో రహస్య మంతనాలు… ఫలించేనా..?
- కాళ్లావేళ్లా పడుతున్న కూసుకుంట్ల.. ముఖం మీదే చీదరిస్తున్న అసమ్మతి నేతలు!
- రేస్ నుంచి కూసుకుంట్ల అవుట్? అభ్యర్థిని మునుగోడు సభలో ప్రకటించనున్న కేసీఆర్..
- కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ… దయాకర్ పై చర్యల తరువాత అలోచిస్తన్నన వెంకటరెడ్డి
2 Comments