
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ పుట్టిస్తోంది. అసమ్మతి నేతలు జిల్లా మంత్రికి జగదీశ్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినా దారికి రాలేదు అసమ్మతి నేతలు. ఈనెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. మరోవైపు అసమ్మతి నేతలు దూకుడు పెంచడంతో జగదీశ్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ వచ్చేలా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్న అసమ్మతి నేతలు.. మునుగోడు సభకు ముందే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అసమ్మతి నేతల ఝలక్ తో మునుగోడు అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.
Read More : సీఎం కేసీఆర్ కు మునుగోడు నేతల షాక్.. కూసుకుంట్లను ఓడిస్తామని తీర్మానం
కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ఏడు మండలాలకు చెందిన అసమ్మతి నేతలు అల్టిమేటమ్ ఇవ్వడంతో.. మునుగోడులో పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించిన సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. మునుగోడుకు సంబంధించి ఆయన ప్రగతి భవన్ లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఎందుకంత వ్యతిరేకత ఉందని విషయంపై కేసీఆర్ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. కూసుకుంట్లపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తాజాగా పీకే టీమ్ కూడా ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిందని సమాచారం. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కేసీఆర్ మరోసారి సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. మునుగోడు టికెట్ రేసులో ఉన్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని ప్రగతి భవన్ కు పిలుపించుకుని మాట్లాడారు కేసీఆర్. దాదాపు గంటన్నర పాటు వాళ్లతో చర్చించారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్న కృష్ణారెడ్డి ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులను కేసీఆర్ తెలుసుకున్నారని తెలుస్తోంది.
Read More : తహసీల్దార్ ఆఫీస్ అడ్డాగా అక్రమ రిజిస్ట్రేషన్ల దందా ..?
మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉండటంతో ఆ దిశగా సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో 67.5 శాతం బీసీ ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గ ఓటర్లు మరో 15 శాతం వరకు ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా నియోజకవర్గంలో బీసీ నినాదం వినిపిస్తోంది. పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కురువృద్దుడు జానారెడ్డిని ఓడించడంలో బీసీ వాదమే అధికార పార్టీకి కలిసివచ్చింది. అందుకే మునుగోడులోనూ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. మునుగోడు నుంచి బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్,భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ పోటీ పడుతున్నారు. బీసీ అభ్యర్థి విషయంలో కేసీఆర్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు కేసీఆర్ తో కంచర్ల సోదరులు భేటీ కావడంతో మునుగోడు టికెట్ కృష్ణారెడ్జికే వస్తుందనే ఆయన అనచరులు ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ లో నెలకొన్న తాజా పరిణామాలతో రెండు రోజులుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మునుగోడు టికెట్ ఖరారైందని వస్తున్నప్రచారం నిజం కాదని తేలిపోయిందంటున్నారు. దీంతో ఈనెల 20న మునుగోడులో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి ….
- కాళ్లావేళ్లా పడుతున్న కూసుకుంట్ల.. ముఖం మీదే ఉమ్మేస్తున్న అసమ్మతి నేతలు!
- కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ… దయాకర్ పై చర్యల తరువాత అలోచిస్తన్నన వెంకటరెడ్డి
- నూతన పోలీస్ బాస్ పోస్టుపై రాష్ట్ర వ్యాప్త చర్చ….
- తుపాకి పేలుడు కేసులో తొమ్మిది మంది నిందితులు అరెస్ట్- జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి.
- రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు ! పంటల సాగు సమయంలో
3 Comments