
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్) : ఇటీవల కాలంలో తుపాకితో ఒకరి పై జరిగిన హత్యా ప్రయత్నం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దడ పుట్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నెల నాలుగవ తేది సాయంత్రం సమయంలో మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిమ్మల స్వామి పైన జరిగిన కాల్పుల సంఘటనలో బి.వెల్లంల జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్న బాలకృష్ణ ను ఎ1 గా నిమ్మల సంధ్యను ఎ2 గా పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళ్తే అదే స్కూల్ లో మధ్యాహ్న భోజన వంట మనిషిగా పనిచేస్తున్న సంధ్యతో బాలకృష్ణ అక్రమంగా సన్నిహిత్యం పెంచుకున్నాడు. వీరిద్దరూ కలిసి భర్త అయిన నిమ్మల స్వామిని అంతమొందించేందుకు పథకం వేశారు. దీనికి సంబంధించి బాలకృష్ణ, స్వామిని చంపడానికి కనుక రామస్వామిని సంప్రదించాడు.
Also Read : సీఎం కేసీఆర్ కు మునుగోడు నేతల షాక్.. కూసుకుంట్లను ఓడిస్తామని తీర్మానం
ఈ విషయంపై రామస్వామి, పోల్ గిరి, రత్నాల వెంకటేష్ లకు విషయం చెప్పటంతో సై అన్నారు. వారందరూ కలిసి మూడు లక్షల రూపాయలు స్వామిని చంపుటకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి బాలకృష్ణ అడ్వాన్స్ గా వారికి ఒక లక్ష డెబై వేల రూపాయలు ఇచ్చాడు. స్వామిని చంపటానికి అతని పైన నిఘా ఉంచేందుకు స్వామి దుకాణం పక్కనే షెట్టర్ ను అద్దెకు తీసుకుని,రామస్వామిని ఉంచాడు. బాధితుడి షాపులో పని చేస్తున్న మొయినుద్దీన్‌తో సన్నిహిత స్నేహాన్ని పెంచుకొని స్వామి యొక్క కదలికలు చెప్పమని, ఇందుకు గాను అతనికి రెండు వేల రూపాయలు ఇస్తానని రామస్వామి సరే అని నిమ్మల స్వామిని చంపడానికి ప్రయత్నించారు, కానీ అది వారికి సాధ్యం కాలేదని సమాచారం. ఈ నేపద్యంలో బాలకృష్ణ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చెయ్యగా, తమ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని ఒక్కో ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారని తెలిసింది. అయినా తన ప్రయత్నం ఆపలేదు బాలకృష్ణ, తన ఇంట్లో ప్లంబింగ్ పని చేసిన యూసుఫ్ కి వివరాలు చెప్పగా, యూసుఫ్ తన స్నేహితుడైన అబ్దుల్ రెహమాన్ అంగీకారంతో సరే అని చెప్పి ప్రణాలికలు ఏర్పాటు చేసుకున్నారు.
Also Read : సైబర్ నేరాలపై సామాజిక మాధ్యమాలలో జాగ్రత్తగా ఉందాలి: ఎస్పి రెమా రాజేశ్వరి – Crime Mirror
అబ్దుల్ రెహమాన్ తన స్నేహితులు అయిన జహంగీర్ పాషా, ఆసిఫ్ ఖాన్ లను నిమ్మల స్వామిని చంపడానికై బాలకృష్ణను పన్నెండు లక్షల రూపాయలు అడిగి పదకొండు లక్షలకు బేరం కుదుర్చుకొని, అడ్వాన్స్ గా అయిదు లక్షల రూపాయలు తీసుకోగా, స్వామి బార్య ఇందులో ఒక లక్ష రూపాయలు ఇచ్చిందని పోలీసుల విచారణలో తెలిసింది. తేదీ 04 ఆగస్టు 2022 న నిందితులు అబ్దుల్ రెహమాన్ మరియు జహంగీర్ కలిసి AP09CK 3002 అనే టివిఎస్ మోటార్ సైకిల్ పై మునుగోడుకు వెళ్లి స్వామి యొక్క కదలికల పైన నిఘా పెట్టీ, సాయంత్రం ఉకొండి పరిసర ప్రాంతంలో బీహార్ రాష్ట్రం నుండి కొనుగోలు చేసిన పిస్టోల్ తో రెహమాన్ స్వామి పైన మూడు సార్లు కాల్పులు జరిపి పారిపోయారు.
Also Read : బ్యూటీపార్లర్ పెట్టిస్తానని.. రెండేళ్లుగా అత్యాచారం
రంగంలోకి దిగిన పోలీసులు Cr. No. 086/2022 U/Sec. 120(B), 307r/w 34 IPC, PS ఆయుధ చట్టంలోని సెక్షన్ 25,27 కింద కేసు నమోదు చేసారు. జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితులు పట్టుకొని, ఆయుధం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని, ఈ కేసులో శాస్త్రీయంగా, సకాలంలో విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ బాదితుడికి హామీ ఇచ్చారు. ఈ కేసును చాకచక్యంగా నల్గొండ డిఎస్పి నరసింహరెడ్డి, డి.యస్.పి మోగిలయ్య అధ్వర్యంలో సి.ఐ చండూర్ అశోక్ రెడ్డి, సిఐ శాలిగౌరరం రాఘవరావు, సిఐ శంకర్ రెడ్డి,యస్ఐ మునుగోడు సతీష్ రెడ్డి,యస్ఐ కట్టంగూర్ విజయ్ కుమార్, మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు
ఇవి కూడా చదవండి :
- ఎల్లుండి మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. టికెట్ రేసులో ముందున్న చెరుకు సుధాకర్?
- హైదరాబాద్ ఈడీకి పవర్ ఫుల్ ఆఫీసర్.. సీఎం కేసీఆర్ కు బిగుస్తున్న ఈడీ ఉచ్చు! గులాబీలో గుబులు..
- మర్రిగూడ మండల కేంద్రంలో 2k ఫ్రీడమ్ రన్….
- మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి…
2 Comments