
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చుండూరు సభలో కోమటిరెడ్డిని అవమానించేలా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు తెలిపారు. నల్గొండ జిల్లా చుండూరులో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన సభలో కోమటిరెడ్డి వెంకట రెడ్డిపై అద్దంకి దయాకర్ పరుష పదజాలం ఉపయోగించి దూషించిన సంగతి తెలిసిందే. దీనిపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also : నూతన పోలీస్ బాస్ పోస్టుపై రాష్ట్ర వ్యాప్త చర్చ….
తాజాగా ఈ అంశంపై రేవంత్ స్పందించారు. మునుగోడులో పాదయాత్ర చేపట్టబోతున్న రేవంత్.. ఈ యాత్రకు ముందు వివాదానికి ముగింపు పలుకుతూ క్షమాపణలు చెప్పారు. చుండూరు సభలో కోమటిరెడ్డిని అవమానించేలా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. ”హోంగార్డ్ ప్రస్తావనతోపాటు, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా. సభలో పరుషమైన పదజాలం వాడినందుకు పీసీసీ చీఫ్‌గా సారీ చెబుతున్నా.
Also Read : తుపాకి పేలుడు కేసులో తొమ్మిది మంది నిందితులు అరెస్ట్- జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి.
అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా సరికాదు. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణా కమిటీని కోరుతున్నా” అని తన వీడియోలో రేవంత్ పేర్కొన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ట్యాగ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యక్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…. అద్దంకి దయాకర్ పై పార్టీ చర్యలు తీసుకుంటేనే రేవంత్ రెడ్డి క్షేమపనలను ఆలోచిస్తానని, లేకపోతే రేవంత్ తెలిపిన క్షేమపనను అంగీకరించే ప్రసక్తే లేదని అయన తేల్చి చెప్పారు. వెంకట్ రెడ్డి మాటలతో మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక మరింత ఆసక్తికరంగా మారాభోతుందో వేచి చూడాలి.
My apologies to brother and colleague @KomatireddyKVR garu. @manickamtagore @UttamINC pic.twitter.com/v7gkvXtlRD
— Revanth Reddy (@revanth_anumula) August 13, 2022
ఇవి కూడా చదవండి :
One Comment