
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : రాజకీయ నాయకులకు అధికారమే ఆయుధం. అధికారం ఉంటే చుట్టు వందలాది మంది అనుచరులు ఉంటారు. అధికారం పోయిందంటే దగ్గరి వారే దూరమవుతారు. ఇక పవర్ లో ఉన్నప్పుడు అధికార మదంతో తానే తోపునంటూ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవహరిస్తే తర్వాత కాలంలో అలాంటి నేతలు చుక్కలు కనిపిస్తుంటాయి. అధికారంతో వేధించిన నేతలకు నరకం చూపిస్తుంటారు అతని బాధితులు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే సీన్ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సొంత పార్టీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ దృష్టిలో కూసుకుంట్లే ముందున్నారని తెలుస్తోంది. అయితే నియోజకవర్గ పార్టీలో నెలకొన్న పరిస్థితులే ఆయనకు గండంగా మారాయని చెబుతున్నారు.
Read More : మునుగోడు రేస్ నుంచి కూసుకుంట్ల అవుట్? అభ్యర్థిని మునుగోడు సభలో ప్రకటించనున్న కేసీఆర్..
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసిన సీఎం కేసీఆర్.. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మళ్లీ పునరాలోచన చేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. చౌటుప్పల్ మండం మల్కాపురంలోని ఆందోళ్ మైసమ్మ గుడి దగ్గర జరిగిన అసమ్మతి నేతల సమావేశానికి దాదాపు 3 వందల మంది నేతలు రావడం టీఆర్ఎస్ పెద్దలను కలవరానికి గురి చేసింది. సమావేశంపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ప్రగతి భవన్ వర్గాలు ఆరా తీశాయని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా మంత్రి జగదీశ్ రెడ్డికి ఫోన్ చేసి చివాట్లు పెట్టారని అంటున్నారు. కేసీఆర్ రియాక్షన్ తో అవాక్కైన జగదీశ్ రెడ్డి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఏం చేస్తావో తెలియదు అసమ్మతి నేతల మద్దతు సంపాదించుకోవాలని ఆదేశించారట.
మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలతో తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలను మచ్చిక చేసుకునేందుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అష్టకష్టాలు పడుతున్నారని అంటున్నారు.అసమ్మతి నేతల నివాసాలకు వెళ్లి బతిమాలాడుతున్నారట. తెల్లవారుజామునే నేతల ఇళ్లదగ్గరకు వెళుతున్నారట కూసుకుంట్ల. అయితే అస్మమతి నేతలు మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ముఖం మీదే చెబుతున్నారని తెలుస్తోంది. చౌటుప్పల్ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ, జడ్పీటీసీల దగ్గరకు వెళ్లిన కూసుకుంట్లకు చుక్కేదురు అయిందంటున్నారు. ఇక సర్పంచ్ లు, ఎంపీటీసీలకు ఫోన్ చేసి బతిమాలాడుతున్నారట కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. గతంలో తాను చేసిన పనులకు క్షమాపణ చెబుతూ తనను సపోర్ట్ చేయాలని వేడుకుంటున్నారట.. కూసుకుంట్ల పరిస్థితి చూసి టీఆర్ఎస్ నేతలు నవ్వుకుంటున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ… దయాకర్ పై చర్యల తరువాత అలోచిస్తన్నన వెంకటరెడ్డి
- తుపాకి పేలుడు కేసులో తొమ్మిది మంది నిందితులు అరెస్ట్- జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి.
- సీఎం కేసీఆర్ కు మునుగోడు నేతల షాక్.. కూసుకుంట్లను ఓడిస్తామని తీర్మానం
- మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి…
- బీసీకే మునుగోడు కాంగ్రెస్ టికెట్? అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ వెయిట్ అండ్ సీ పాలసీ…