
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్‌లో ఉమెన్ సే ఫ్రీ వింగ్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి హాజరై మాట్లాడుతూ జిల్లాలోని 52 పాఠశాలల నుండి 104 మంది సైబర్ అ ౦బాసిటర్‌గా విద్యార్థులను ,52 మంది ఉపాద్యాయులను మెంటర్స్‌గా ఎంపిక చేసి వారికి ఆన్‌లైన్ క్లా సుల ద్వారా సైబర్ నేరాలు వాటివల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా ఎదుర్మోవాలి తదితర విషయాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. శిక్షణలో ప్ర తిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు మెమొంటోలు అందజేశారు.
Read More : బ్యూటీపార్లర్ పెట్టిస్తానని.. రెండేళ్లుగా అత్యాచారం
ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని , మహిళల రక్షణ , భద్రత కై పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అ న్నారు. షీటీంలు ఏర్పాటుచేసి వివిద కార్యక్రమాల ద్వా రా అవగాహన కల్పిస్తూ వారికి అందుబాటు లో ఉంటుందన్నాడు. విద్యార్థినిలు, మహిళలు వ్యక్తిగత భద్రతకు సంబందించి ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, నోడల్ ఆఫీసర్ , అడిషనల్ ఎస్పీ అశ్వాక్, డిఇవో భిక్షపతి, షీటీమ్ ఇంచార్జ్ సిఐ.రాజశేఖర్ గౌడ్, సైబర్ క్రైం ఎస్‌ఐ.నాగరాజు, జెండర్ కోఆర్డినేటర్ సరిత, పూజ యంగిస్తాన్, ఎన్‌జివో వెంకట్, భరోసా సెంటర్ సిబ్బంది , కళా బృందం పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- హైదరాబాద్ ఈడీకి పవర్ ఫుల్ ఆఫీసర్.. సీఎం కేసీఆర్ కు బిగుస్తున్న ఈడీ ఉచ్చు!
- మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి…
- తల్లి, తాతల మధ్య అక్రమ సంబంధం.. ముక్కుపచ్చలారని చిన్నారి బలి!
- కేసీఆర్ దూకుడు అందుకేనా? ఇంత పెద్ద స్కెచ్ ఉందా?
- సంపులో 2 వేల నోట్ల కట్టలు.. ఐటీకి దొరికిన రాజకీయ నేత
One Comment