
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీలో సెగలు రేపుతోంది. నియోజకవర్గ టీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఈనెల 20ను మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. దీంతో మునుగోడు టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికేననే ప్రచారం సాగుతోంది. మునుగోడు బహిరంగ సభలో కూసుకుంట్లను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటిస్తారని అంటున్నారు. కేసీఆర్ మునుగోభకు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి.
Read More : మునుగోడు టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీ నేతల డిమాండ్
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్న అసమ్మతి నేతలు మరింత దూకుడు పెంచారు. మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడులో పర్యటిస్తుండగానే ప్రత్యేక సమావేశం పెట్టారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ ఆందోళ మైసమ్మ దేవాలయం వద్ద ఫంక్షన్ హాల్లో మునుగోడు టిఆర్ఎస్ అసమతి నేతలు సమావేశమయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన దాదాపు 300 మంది టిఆర్ఎస్ నేతలు ఈ సమావేశయ్యానికి హాజరయ్యారు. చౌటుప్పల్ ఎంపీల తాడురి వెంకట్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ వెన్ రెడ్డి రాజు, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, నారాయణ పురం జడ్పీటీసీ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఉప ఎన్నికలో కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని ఈ సమావేశంలో ఏకంగా తీర్మానం చేశారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్దమని అసమ్మతి నేతలు ప్రకటించారు. తాజా పరిణామాలు మంత్రి జగదీశ్ రెడ్డికి షాకింగ్ గా మారాయి.
Read More : మునుగోడులో ఒంటరైన కూసుకుంట్ల! టీఆర్ఎస్ కు కొత్త లీడర్ ఎవరో?
ఇటీవలే మునుగోడు టీఆర్ఎస్ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి. వాళ్లందరిని ప్రగతి భవన్ తీసుకెళ్లారు. అక్కడే మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి… మునుగోడు టీఆర్ఎస్ లో ఎలాంటి అసమ్మతి లేదన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరూ పనిచేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించేందుకు శుక్రవారం మునుగోడు వచ్చిన మంత్రి.. పార్టీలో అసమతి నేతలు లేరు ఆశావాహులు మాత్రమే ఉన్నారన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తారని చెప్పారు. మంత్రి ఈ ప్రకటన చేసిన కాసేపటికే చౌటుప్పల్ మండలంలో ఏడు మండలాలకు చెందిన అసమ్మతి నేతలు సమావేశం కావడం కలకలం రేపుతోంది. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని అసమ్మతి నేతలు చెప్పడం టీఆర్ఎస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. తాజా సమావేశం మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్ గా మారిందంటున్నారు. అసమ్మతి నేతలతో ఆయన మాట్లాడాలని చూసినా.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
- మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి…
- మునుగోడు బైపోల్ వేళ బీజేపీ సంచలనం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తీన్మారేనా?
- కేసీఆర్ కు కూసుకుంట్ల భూఆక్రమణల చిట్టా? టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటూ రిపోర్ట్..
- కేసీఆర్‌ను రాజకీయంగా ఓడగొట్టకపోతే తన జన్మకకు అర్థం లేదు.. ఈటల
- మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
3 Comments