
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జీడిమెట్ల ఠాణా పరిధిలో ఓ యువతికి బ్యూటీ పార్లర్ పెట్టిస్తానని నమ్మించి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. షాద్‌నగర్‌కి చెందిన యువతి (29) బ్యూటీషియన్. డిప్లొమా చేసే సమయంలో రమేశ్ అనే స్నేహితుడి ద్వారా సంజీవరెడ్డి పరిచయమయ్యాడు. కోర్సు పూర్తయిన తర్వాత యువతికి బ్యూటీపార్లర్ పెట్టుకునేందుకు సాయం చేస్తానని నమ్మించి దగ్గరయ్యాడు. 2020లో సికింద్రాబాద్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని అందులో ఉంచాడు. అన్నీ చూసుకుంటానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు.
Read More : మునుగోడులో కూసుకుంట్లకు చెక్.. ఏకమైన టీఆర్ఎస్ బీసీ నేతలు
యువతిని గది నుంచి బయటకు రానివ్వకపోగా బ్యూటీపార్లర్‌నూ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకొని గాజులరామారంలోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటోంది. బుధవారం ఆమె పుట్టినరోజు కావడంతో చిరునామా తెలుసుకొని ఫ్లాట్‌కి వచ్చాడు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని బలవంతంగా తాగించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని తీరుతో విసిగిపోయిన యువతి అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పవన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ఎల్లుండి మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. టికెట్ రేసులో చెరుకు సుధాకర్?
- హైదరాబాద్ ఈడీకి పవర్ ఫుల్ ఆఫీసర్.. సీఎం కేసీఆర్ కు బిగుస్తున్న ఉచ్చు!
- మర్రిగూడ మండల కేంద్రంలో 2k ఫ్రీడమ్ రన్….
- మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి…
- నెరవేరనున్న కోమటిరెడ్డి కల… ప్రజలకు వరంగా మారనున్న తన రాజీనామా!
2 Comments