
క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవలని జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబర్ జెడ్ పి టి సి పాశం సురేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గురువారం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు మర్రిగుడ మండల కేంద్రంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 2k ఫ్రీడమ్ రన్ ను ఆయన ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయ పౌరుడు దేశ భక్తి నీ పెంపొందించుకోవాలని దేశం స్వాతంత్య్రం కోసం పోరాటాలు నడిపిన మహనీయుల అడుగు జాడల్లో నడవాలని దేశ రక్షణ లో ముందుండాలని విద్యార్థులకు.యువకులకు పిలుపునిచ్చారు ఈ యొక్క 2k ఫ్రీడమ్ రన్ స్థానిక బస్టాండ్ నుండి ఆదర్శ పాఠశాల వరకు వందలాది మంది విద్యార్థులు .యువకులు .అయా పార్టీల నాయకులు జాతీయ జెండాలను పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి దేశ భక్తి నీ చాటారు ..
Read Also : నెరవేరనున్న కోమటిరెడ్డి కల… ప్రజలకు వరంగా మారనున్న తన రాజీనామా!
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నల్ల యాదయ్యా, తెరాస విద్యార్ధి నేత దామెర బీమనపల్లి ఎంపీటీసీ సిలివేరు విష్ణు, వైస్ ఎంపీపీ కట్కురి వెంకట్. ఎంపిడిఓ రమేష్ దీన్ దయాళ్, ఎస్ఐ గుత్తా వెంకట్ రెడ్డి, కమ్మగుడ సర్పంచ్ నిర్మల లూర్దయ్య, రాజ్పేట తండ సర్పంచ్ సక్కుబాయి బిచ్యనాయక్, ఆయా పార్టీల నాయకులు చెరుకు శ్రీరామ్ గౌడ, పందుల పాండు గౌడ్, ఆయా శాఖల అధికారులు . పోలీస్ సిబ్బంది . ఆయా గ్రామల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడు బైపోల్ వేళ బీజేపీ సంచలనం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తీన్మారేనా?
- కాంగ్రెస్ పార్టీ నేతలకు రాజగోపాల్ “గాలం” ?.. మర్రిగూడ మండలంలోనూ ఇదే తంతు.
- రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైద్యుడికి పదేళ్ల జైలు శిక్ష
- బీసీకే మునుగోడు కాంగ్రెస్ టికెట్? అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ వెయిట్ అండ్ సీ పాలసీ…
- కేసీఆర్ కు కూసుకుంట్ల భూఆక్రమణల చిట్టా? టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటూ రిపోర్ట్..