
- బైఎలక్షన్ లో విజయ పతాకానికి కసరత్తులు.
- కాంగ్రెస్ పార్టీ నేతలతో బేటి, సమస్యల గురించి ఆరా.
- కలిసి వచ్చే దిశగా బిజెపి, కాంగ్రెస్, ప్రభుత్వ వ్యతిరేకుల ఓట్లు.
- అమలు కానున్న అటకమీది పధకాలు, ప్రారంబోత్సవాలు.
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): తను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో కన్న కలలన్నీ తన రాజీనామా ద్వారా నేరవేరనున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నియోజక వర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవ చెయ్యాలన్న సంకల్పానికి ఇన్ని రోజులు ప్రభుత్వ సహకారం లేకపోవటంతో ఎన్నో రోజులు ఇబ్బంది పడ్డ రాజగోపాల్ రెడ్డి తన పదవి రాజీనామాతో అయినా సరే ప్రజలకు సేవలు అందించాలనే ఆలోచనతో ముందడుగు వేసారని చెప్పుకోవచ్చు.
Read More : కేసీఆర్ కు కూసుకుంట్ల భూఆక్రమణల చిట్టా? టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటూ రిపోర్ట్..
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కావటంతో శంకుస్థాపన నుండి మొదలు పెడితే ప్రతి పనికి కూడా మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అడ్డుపడటం వల్ల నియోజకవర్గ అభివృద్ధి పనులు అటకెక్కాయన్న విధంగా తయారైందని ప్రజలు అనుకుంటున్నారు. తన రాజీనామా అనంతరం బిజెపిలో చేరుతానన్న రాజగోపాల్ రెడ్డి తన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వెంట తీసుకువెల్లాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో మండలాల వారిగా సమవేశాలు నిర్వహిస్తున్న ఆయనకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. గ్రామాల వారిగా సమస్యలు అడిగి తెలుసుకోవటం, తెరాస ప్రభుత్వం వల్ల జరుగుతున్న నష్టాలను, పార్టీని వీడటానికి గల కారణాలను విడమర్చి చెప్పారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తెలిపారు.
Read More : దుర్మార్గపు పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది…!!
మొదటి నుండే కోమటి రెడ్డి బ్రదర్స్ కి మంచి క్యాడర్ ఉండటంతో అభిమానులకు మాత్రం కొదవ లేదనే ప్రచారం కొనసాగుతుంది. ఇక తెరాస పార్టీ నుండి కూసుకుంట్ల నిలబడితే మాత్రం రాజగోపాల్ రెడ్డి ప్రచారం చెయ్యనవసరం లేకుండానే విజయాన్ని కైవసం చేసుకోవచ్చు అంటున్నారు. ప్రజానికం. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి గెలుపుకై ఒక పక్క కాంగ్రెస్, బిజెపి పార్టీలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకుల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజీనామా కారణంగా నెలలు గడుస్తున్నా మరమత్తుకు నోచుకోని రోడ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆసుపత్రిల శంకుస్థాపనలు జోరందుకున్నాయి. ఏదేమైనా తన రాజీనామా అభివృద్దిని పరుగులు పెట్టిస్తుందని అనుకుంటున్నారు. ఇక ఎలక్షన్ లు రావటమే లేట్ ఇంటికి లక్ష్మి దేవి నడుచుకుంటూ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- మునుగోడు బైపోల్ వేళ బీజేపీ సంచలనం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తీన్మారేనా?
- కాంగ్రెస్ పార్టీ నేతలకు రాజగోపాల్ “గాలం” ?.. మర్రిగూడ మండలంలోనూ ఇదే తంతు.
- బీజేపీతో పొత్తు దిశగా టీడీపీ… రాజకీయంగా ఆ చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో
- రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైద్యుడికి పదేళ్ల జైలు శిక్ష
- బీసీకే మునుగోడు కాంగ్రెస్ టికెట్? అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ వెయిట్ అండ్ సీ పాలసీ…
3 Comments