
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : నల్గొండ జిల్లా ముుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక రెండు నెలల్లోనే జరిగే అవకాశం ఉండటంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థి ఎంపికపై అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ఫోకస్ చేశాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న అమిత్ షా హాజరుకానున్న చౌటుప్పల్ బహిరంగ సభలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆ సభలోనే కోమటిరెడ్డిని మునుగోడు బీజేపీ అభ్యర్థిగా అమిత్ షా ప్రకటిస్తారని తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నాయి. మునుగోడుఫై పోకస్ చేసిన కాంగ్రెస్ గాంధీభవన్ లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ బుధవారం హైదరాబాద్ వచ్చారు. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ నేతలతో చర్చించారు.
Read More : కేసీఆర్ కు కూసుకుంట్ల భూఆక్రమణల చిట్టా? టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటూ రిపోర్ట్..
మునుగోడు అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లారిటీకి వచ్చిందని అంటున్నారు. మునుగోడు కాంగ్రెస్ రేసులో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, చెరుకు సుధాకర్, పాల్వాయి స్రవంతి రెడ్డి, చలమల్ల కృష్ణారెడ్డి, పున్న కైలాస్ నేత, పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులను గాంధీభవన్ కు పిలిపించి మాట్లాడబోతున్నారు మాణిక్యం ఠాకూర్. అయితే బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని దాదాపుగా డిసైడ్ అయ్యిందని తెలుస్తోంది. మునుగోడులో బీసీ ఓటర్లే 70 శాతం వరకు ఉండటంతో తమకు కలిసి వస్తుందని పీసీసీ అంచనా వేస్తుందని సమాచారం. బీసీ నేతకు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు పీసీసీ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న కృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే హామీతో అతనితో ఉప ఎన్నిక ఖర్చుల పెట్టించే యోచనలో ఉన్నారంటున్నారు.
Read More : అధికారులను బెదిరిస్తున్న కూసుకుంట్ల? మునుగోడు తహశీల్దార్…
ఇక మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ వెయిట్ చేసే దోరణిలో ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలాకే టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలస్తోంది. కాంగ్రెస్ బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే.. కారు పార్టీ నుంచి కూడా బీసీ నేతే రంగంలో ఉంటారంటున్నారు. ఆ దిశగా కేసీఆర్ కసకరత్తు చేస్తున్నారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. అయితే టీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణలో కూసుకుంట్లకు అనుకూలంగా కథనం రావడంతో టికెట్ ఆయనకే వస్తుందా అన్న చర్చ సాగుతోంది. కాని మునుగోడు ఓటర్ల స్పందన తెలుసుకోవడానికే తమ పార్టీ పత్రికలో అలా వార్త రాయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ కథనం ఆధారంగా నియోజకవర్గంలో కేసీఆర్ టీమ్ లో సర్వే చేస్తాయని తెలుస్తోంది. కూసుకుంట్ల అభ్యర్థిత్వంపై బీసీ వర్గాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- దుర్మార్గపు పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది…!!
- మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు 30 వేలు!
- దాసోజు శ్రావణ్ పోటీ చేసేది అక్కడి నుంచే?
- నాంపల్లి సీఐ శంకర్ రెడ్డి పై బదిలీ వేటు.
- కోమటిరెడ్డి సోదరుల ఔట్… కంచర్ల బ్రదర్స్ ఇన్?
4 Comments