
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మరోసారి బీజేపీ – టీడీపీ కలవబోతున్నాయా. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోనున్నాయా. రాజకీయంగా ఆ చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినిపిస్తోంది. ప్రధాని మోదీ- టీడీపీ అధినేత చంద్రబాబుతో నాలుగేళ్ల విరామం తరువాత పలకరింపులు …మరోసారి కలవాలనే చంద్రబాబు ప్రయత్నాలతో ఇప్పుడు ఈ చర్చ ఊపందుకుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో మోదీని ఓడిస్తామని శపథం చేసారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలోనూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
Also Read : బీసీకే మునుగోడు కాంగ్రెస్ టికెట్? అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ వెయిట్ అండ్ సీ పాలసీ…
వచ్చే ఏడాది తెలంగాణలో.. 2024 లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో గెలుపు ఈ సారి బీజేపీకి ప్రతిష్ఠాత్మకం కాగా, ఏపీలో విజయం టీడీపీకి అత్యంత కీలకం. దీంతో..రెండు పార్టీల అవసరాల కారణంగా పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల సమయం నుంచి ఏపీలో వైసీపీ – బీజేపీ అధినాయకత్వం మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ, వచ్చే ఎన్నికల నాటికి తిరిగి తన స్థానంలోకి తాను చేరుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. తెలంగాణలోనూ అవసరమైతే బీజేపీకి సహకారం అందిస్తామనే సంకేతాలు టీడీపీ నుంచి మొదలయ్యాయి. ఈ సమయంలో బీజేపీ ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
ఏపీ, తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో సై అంటే సై అనే విధంగా ముందుకు వెళ్తున్న సమయంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మొత్తంగానే నష్టపోతామని.. మరోసారి సెంటిమెంట్ తో కేసీఆర్ పై చేయి సాధిస్థారని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక, ఏపీలో.. బీజేపీతో టీడీపీకి ఓట్ల పరంగా ప్రయోజనం అంతగా లేకున్నా… ఎన్నికల వేళ కేంద్రం అండగ కీలకమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఏపీ బీజేపీలోనూ టీడీపీతో పొత్తు పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు టీడీపీతో పొత్తు మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం గత ఎన్నికల సమయంలో ప్రధాని పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.
Read Also : కేసీఆర్ కు కూసుకుంట్ల భూఆక్రమణల చిట్టా? టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటూ రిపోర్ట్..
ఇప్పుడు వైసీపీ మద్దతు దారులు సైతం గతంలో ప్రధాని పైన చంద్రబాబు చేసిన వ్యక్తిగత విమర్శలను ప్రస్తుతం సర్క్యులేట్ చేస్తున్నారు. చంద్రబాబుతో మరోసారి పొత్తు వద్దనది ఆ నేతల అభిప్రాయం. అయితే, వైసీపీ మాత్రం ఎవరు పొత్తులు పెట్టుకున్నా..తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేస్తోంది. బీజేపీ – టీడీపీ మధ్య సంబంధాలపైన అటు జనసేనాని వేచి చూసే ధోరణితో ఉన్నారు. వారి బంధం పైన క్లారిటీ వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయంగా తన వ్యూహాలు స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో చోటు చేసుకొనే రాజకీయాలు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా ప్రభావం చూపనున్నాయి.
ఇవి కూడా చదవండి :
- రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైద్యుడికి పదేళ్ల జైలు శిక్ష
- దుర్మార్గపు పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది…!!
- తెలంగాణ బీజేపీకి సినీ గ్లామర్ సహజనటికి కమలం పార్టీ నేతలతో ఈటల రాజేందర్ చర్చలు
- సెప్టెంబర్ లోనే మునుగోడు ఉప ఎన్నిక! రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ సిగ్నల్..