
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం ముదురుతోంది. ఇప్పటికే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పిన అసమ్మతి నేతలు.. ఇప్పుడు మరో ముందడుగు వేశారని తెలుస్తోంది. గత ఎనిమిది ఏళ్లుగా మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీగా భూదందాలు నిర్వహించారని, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆయన వ్యతిరేక నేతలు ఆరోపిస్తున్నారు. కూసుకుంట్ల భూ ఆక్రమణాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించారని తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి కూసుకుంట్ల అక్రమాల చిట్టాలను ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే కేటీఆక్ ను కలవలాని డిసైడ్ అయ్యారంటున్నారు.
Read More : మునుగోడు టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీ నేతల డిమాండ్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ రేసులో ఆరుగురు నేతలు ఉన్నారు. ప్రస్తుత ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణా రెడ్డి పోటీలో ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న నేతల్లో కూసుకుంట్ల మినహా మిగితా వారంతా ఏకతాటిపైకి వచ్చారని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ నేతలంతా హైదరాబాద్ లోని ఓ హోటల్ లో రహస్య సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. ఈ సమావేశానికి టికెట్ రేసులో ఉన్న నేతలతో పాటు నియోజకవర్గంలోని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశంలోనే కూసుకుంట్లకు సంబంధించిన అక్రమాల చిట్టాను హైకమాండ్ కు ఇవ్వాలని నిర్ణయించారట. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తేల్చి చెప్పాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.
Read More : 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం? ఏ పార్టీలో చేరబోతున్నారో?
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భూదందాలతో టీఆర్ఎస్ నేతలే ఎక్కువగా నష్టపోయారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. కొందరు నేతలు రోడ్డున పడ్డారని కూడా చెబుతున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ప్రత్యర్థులకు ముునగోడు సీటును వరంగా ఇచ్చినట్లేనని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని అసమ్మతి నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉందని కూడా ఈ నేతలు హైకమాండ్ కు వివరించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక కూసుకుంట్ల భూఆక్రమణల చిట్టాను హైకమాండ్ కు పంపించారనే వార్తలతో ఆయన వర్గంలో ఆందోళన నెలకొందని తెలుస్తోంది. అసమ్మతి నేతలకు చెక్ పెట్టేందుకు మంత్రి జగీదశ్ రెడ్డిని కూసుకంట్ల కాకా పడుతున్నారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- దుర్మార్గపు పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది…!!
- తెలంగాణ బీజేపీకి సినీ గ్లామర్ సహజనటికి కమలం పార్టీ నేతలతో ఈటల రాజేందర్ చర్చలు
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచి….. యువతులను మోసం చేసి
- సుధీర్ రెడ్డి నువ్వా నైతికత గురించి మాట్లాడేది?
- ఇంతకి ప్రధాని క్షమాపణ కోరినట్టేనా? బీజేపీది మాటల గారడీనా?
3 Comments