
ఓ ప్రజా ప్రతినిధిగా కొనసాగుతూ బేర సారాలు..?
పార్టీ నేతల కంటే ముందే తానే జంప్ అయ్యే ఛాన్స్
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్) : మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా, ప్రజా ప్రతినిధులకు, పార్టీలు మారే నేతలకు వరంగా మారింది. నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులను, ద్వితీయ శ్రేణి నాయకులను తన వెంట బిజెపిలోకి తీసుకువెళ్లేందుకు రాజగోపాల్ రెడ్డి అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై దృష్టి సారించారు. గతంలో తనతో కలిసి పని చేసిన నాయకులను వెంట రావాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని బెట్టు చేస్తున్న వారిని, రాజగోపాల్ రెడ్డి ఒక మెట్టు దిగి… వారిని ఏదో ఒక విధంగా ఒప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులను, ద్వితీయ శ్రేణి నాయకులు బిజెపిలోకి తీసుకు వెళ్లడం ద్వారా గెలుపుకు బాటలు వేసుకోవాలన్న ప్రయత్నంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయితే స్థానిక ప్రజా ప్రతినిధులను, ద్వితీయ శ్రేణి నాయకులను తన వెంట వచ్చేందుకు ఆయన బేర సారాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read More : కేసీఆర్ కు కూసుకుంట్ల భూఆక్రమణల చిట్టా? టికెట్ ఇస్తే ఓటమి ఖాయమంటూ రిపోర్ట్..
మర్రిగూడ మండలానికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి రాజగోపాల్ రెడ్డితో పార్టీ మారుతానని బేరసారాలను కొనసాగిస్తున్నట్లు వినికిడి. నక్ష బాటను కబ్జా చేసి, బహుళ అంతస్థు భవనాన్ని నిర్మించడమే కాకుండా, అనుమతి లేని వెంచర్లో కీలక వ్యాపార భాగస్వామిగా ఉన్న సదరు ప్రజా ప్రతినిధి, తాను ఒక్కడే పార్టీ మారకుండా, తనతో పాటు కొంత మంది సైన్యంతో చేరుతానని చెప్పి గుండు గుత్తగా ప్యాకేజ్ మాట్లాడుకున్నాడని మండల వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అయితే సదరు ప్రజా ప్రతినిధి పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని మండల వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఆయన్ని ఏరి కోరి తనతో పాటు బిజెపిలోకి తీసుకువెళ్తే నష్టపోయేది రాజగోపాల్ రెడ్డియేనని వారు అంటున్నారు. భూకబ్జా ఆరోపణలతో పాటు, అనేక విమర్శలను ఎదుర్కొంటున్న సదరు ప్రజాప్రతినిధి చేరిక వల్ల బిజెపికి లాభం కంటే నష్టమే ఎక్కువ అని రాజగోపాల్ రెడ్డి గుర్తిస్తే మంచిదని సూచిస్తున్నారు.
Read More : మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..
కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతూనే, ప్రత్యర్థి పార్టీ నేతలతో బేరసారాలను కొనసాగిస్తున్న సదరు ప్రజా ప్రతినిధి వ్యవహార శైలిపై కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐరన్ లెగ్ నాయకుడు, ఏ పార్టీలో కాలు మోపితే ఆ పార్టీ ఖతమని వారు మండిపడుతున్నారు. పార్టీ మారితే సదరు ప్రజాప్రతినిధికి… ఒక కారు , పది లక్షల రూపాయలు చెల్లించే విధంగా, ఇప్పటికే బేర సారాలు కుదిరాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలంలోని కీలక ప్రజాప్రతినిధి అయిన ఆయన పేరు ఎత్తితేనే… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు బీజేపీలో కూడా ఆమడ దూరంలో ఉంటున్నారని వినికిడి. ముందస్తు జాగ్రత్తలు పాటించి సదరు ప్రజాప్రతినిధిని దూరంగా ఉంచటం బీజేపీ పార్టీకే మంచిదని పలువురు హేచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- బీజేపీతో పొత్తు దిశగా టీడీపీ అగుగులు…?
- రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైద్యుడికి పదేళ్ల జైలు శిక్ష
- ల@జ కొడుకా.. సీఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ బూతులు
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని పాప మృతి.. ముగ్గురికి సీరియస్
- మైలార్‌దేవ్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య
- మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి? ఎమ్మెల్సీగా కూసుకుంట్ల, కర్నెలో ఒకరికి ఛాన్స్?
One Comment