
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజీనామా లేఖ ఇచ్చిన 10 నిమిషాల్లో ఆమోదించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కొన్ని గంటల్లోనే మునుగోడు అసెంబ్లీ సీటు ఖాళీగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ కూడా ఇచ్చింది. నిజానికి కోమటిరెడ్డి రాజీనామా చేసినా స్పీకర్ వెంటనే ఆమోదించరనే ప్రచారం సాగింది. కాని నిమిషాల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ కూడా ఉప ఎన్నికకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజీనామా ఆమోదంతో మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఆగస్టు8న మునుగోడు అసెంబ్లీ సీటు ఖాళీ అయింది కాబట్టి.. ఎన్నికల సంఘం రూల్ ప్రకారం ఫిబ్రవరి 8లోపు ఆ సీటును భర్తీ చేయాలి. ఈ ఆరు నెలల్లో ఉప ఎన్నికను ఎప్పుడైనా జరిపే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది.
Read More : మునుగోడు టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీ నేతల డిమాండ్
ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ గడువు ముగియనుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ చివర లేదా డిసెంబర్ లో జరిగే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మునుగోడు ఉప ఎన్నిక రావొచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మునుగోడు ఉప ఎన్నిక రానుందని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడవు నవంబర్ తో ముగియనుంది. అంటే హిమాచల్ ప్రదేశ్ లో అక్టోబర్ లోనే ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అక్టోబర్ లో మునుగోడుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ దిశగా తెలంగాణ బీజేపీ నేతలకు బీజేపీ హైకమాండ్ నుంచి సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. అక్టోబర్ పోలింగ్ అంటే సెప్టెంబర్ లోనే ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ లోనే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడం ఖాయమని చెబుతున్నారు.
Read More : నల్గొండ కలెక్టర్ గా వినయ్ కృష్ణ రెడ్డి.. మునుగోడు ఉపఎన్నిక కోసమేనా?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే విషయం తన అనుచరులతో చెబుతూ వస్తున్నారు. తాజాగా మీడియాతోనూ ఇదే చెప్పారు. చౌటుప్పల్ మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ను కలిశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్.. మునుగోడుకు సెప్టెంబర్ లోనే ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. బీజేపీ పెద్దల నుంచి సంకేతం రావడం వలనే కోమటిరెడ్డి ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అంతేకాదు రూట్ మ్యాప్ ప్రకారం బండి సంజయ్ పాదయాత్ర చౌటుప్పల్ మండలం నుంచి రామన్నపేట మీదుగా వెళ్లాలి. కాని మునుగోడు నియోజకవర్గంలోని మిగితా ఐదు మండలాలు కవర్ అయ్యేలా రూట్ మార్చాలని సంజయ్ ని కోరారు కోమటిరెడ్డి. ఆ దిశగానే సంజయ్ రూట్ మారనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే ఉప ఎన్నిక రానుండటంతో మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కవర్ చేస్తూ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. మొత్తంగా బీజేపీ పెద్దల నుంచి వస్తున్న సమాచారం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా ప్రకటనతో మునుగోడు ఉప ఎన్నిక సెప్టెంబర్ లోనే జరగడం ఖాయమని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి? ఎమ్మెల్సీగా కూసుకుంట్ల, కర్నెలో ఒకరికి ఛాన్స్?
- మునుగోడు టీఆర్ఎస్ ఇంచార్జ్ గా హరీష్ రావు.. పీకే టీమ్ సర్వే ఆధారంగానే అభ్యర్థి ఎంపిక
- మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు 30 వేలు!
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా?
- ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా… ఆమోదించిన స్పీకర్
One Comment