
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది మునుగోడు నియోజకవర్గం. ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ చేయడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ లో రోజురోజుకు వర్గ పోరు తీవ్రమవుతోంది. మునుగోడు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ తనకే వస్తుందనే ధీమాలో ఉన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ తనకు ఈసారి అవకాశం రావడం ఖాయమని చెబుతున్నారు. భువనగిరి ఎంపీ మాజీ బూర నర్సయ్యగౌడ్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ తో పాటు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు .అంతేకాదు ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తేల్చి చెబుతున్నారు.
Read More : నల్గొండ కలెక్టర్ గా వినయ్ కృష్ణ రెడ్డి.. మునుగోడు ఉపఎన్నిక కోసమేనా?
ఉప ఎన్నికపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి వర్గ పోరు విషయం పోయింది. నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో మాట్లాడిన పార్టీ పెద్దలు.. వర్గ విభేదాలు తీవ్రంగానే ఉన్నాయని గ్రహించారని తెలుస్తోంది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక కోసం మరో వ్యూహం రచిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న నేతలు కాకుండా మధ్యే మార్గం శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మునుగోడు బరిలో దింపాలనే ప్లాన్ చేస్తుందని సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో గుత్తాకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో నల్గొండ ఎంపీగా పని చేసిన గుత్తా.. మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా తిరిగేవారు. గుత్తా పోటీ చేస్తే ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న నేతలంతా అతనికి మద్దతుగా ఉంటారని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. గుత్తా పోటీ చేస్తే మునుగోడులో ఘన విజయం సాధించడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని తెలుస్తోంది. అందుకే గుత్తా అభ్యర్థిత్వం విషయంలో కేసీఆర్ సీరియస్ గా ఆలోచన చేస్తున్నారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం.
Read More : మునుగోడులో ఒంటరైన కూసుకుంట్ల! టీఆర్ఎస్ కు కొత్త లీడర్ ఎవరో?
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ విషయంపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మునుగోడులో పోటీ చేస్తానని ప్రకటించారు. మునుగోడులో పోటీ చేయాలని ఎవరూ తనను అడగలేదని… అడిగితే ఆలోచిస్తానని అన్నారు. ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బిజెపికి అవసరమన్నారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమని హెచ్చరించారు.సీఎం కేసీఆర్ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చురకలు అంటించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటి నుండి అలవాటని ఎద్దేవా చేశారు బిజెపి లో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరని తేల్చి చెప్పారు. మునుగోడులో టీఆర్‌ఎస్ పార్టీ అక్కడ గెలుస్తుందని గుత్తా స్పష్టం చేశారు.
Read More : శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
గుత్తా సుఖేందర్ రెడ్డి తాజా ప్రకటనతో మునుగోడు నుంచి పోటీ విషయంలో ఆయన సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు గుత్తా మునుగోడు నుంచి పోటీ చేసి గెలిస్తే ఆయనకు మంత్రిపదవి రావడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. గుత్తా కూడా మంత్రిపదవి కావాలని కోరుకుంటున్నారు . ఉప ఎన్నికలో గుత్తా పోటీ చేస్తే ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ సీటును మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లేదా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లో ఎవరికో ఒకరికి ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు టీఆర్ఎస్ ఇంచార్జ్ గా హరీష్ రావు.. పీకే టీమ్ సర్వే ఆధారంగానే అభ్యర్థి ఎంపిక
- గుట్టల బేగంపేటలో పలువురికి అస్వస్థత..ఒకరు మృత
- ఎల్బీనగర్ లో గ్యాంగ్ వార్ .. నర్సింహా రెడ్డి మృతి
- మునుగోడు టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీ నేతల డిమాండ్
- మోడీ వేస్ట్.. సీజేఐ గ్రేట్! సీఎం కేసీఆర్ సంచలనం..
One Comment