
- పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బల తీశాడంటూ ఆరోపణ
- ఆయనకు టికెట్ ఇస్తే తామంతా పార్టీ మారడం ఖాయమని వెల్లడి
- పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసిన మునుగోడు నేతలు
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : మునుగోడు ఉప ఎన్నిక లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని మునుగోడు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి…మూడు గ్రూపులు, ఆరు పంచాయితీలు అన్నట్టుగా తయారయింది. మునుగోడు అసెంబ్లీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణా రెడ్డిలు పోటీ పడుతున్నారు.
Read More : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా?
టిఆర్ఎస్ నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు గ్రూపులుగా విడిపోయి, తమ నేతకు టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నాయి. అయితే కూసుకుంట్ల వ్యతిరేక వర్గీయులు ఒక అడుగు ముందుకేసి… ఆయనకు టికెట్ ఇస్తే తాము పనిచేసేది లేదని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు తెగేసి చెప్పడం, నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా పరిశీలించొద్దని కోరిన వారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం సొంత పార్టీ ప్రజాప్రతినిధుల ఆర్థిక మూలాలన్నింటినీ దెబ్బతీశారని వాపోయారు. తన మాట వినని వారిపై పోలీసులు కేసులు నమోదు చేయించారని, వార్డు సభ్యుడు నుంచి జడ్పీటీసీ వరకు ఉన్న నేతల మధ్య విభేదాలు సృష్టించి పార్టీని బలహీనపరిచారని మండిపడ్డారు.
Also Read : కూసుకుంట్ల అండతో అనుచరుల అక్రమాలు.. ప్రశ్నించిన సొంత పార్టీ సర్పంచ్ పైనే కేసు!
రానున్న ఉప ఎన్నికలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే, పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు బీజేపీ లేదంటే కాంగ్రెస్ పార్టీలలో చేరడం ఖాయమని పేర్కొన్నవారు, పార్టీ నాయకత్వం తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కేటీఆర్‌ను కోరారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలతో గత నాలుగు రోజులుగా కేటీఆర్ సమావేశం అవుతూ, పార్టీ గెలుపోట ముల పై, అభ్యర్థుల ఎంపిక గురించి, పార్టీ నాయకులను ఆరా తీసినట్లు తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జెడ్పీ టిసి లను కేటీఆర్ తన వద్దకు పిలిపించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈసారి బీసీ కే ఛాన్స్ : రానున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు పార్టీ నిర్వహించిన సర్వేలలో బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మునుగోడు టికెట్ కోసం బిసి అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని వారు అన్నారు. బిసి అభ్యర్థుల రేసులలో పద్మశాలి సామాజిక వర్గం నుంచి కర్నాటి వెంకటేష్, విద్యాసాగర్, బొల్ల శివ శంకర్, గౌడ్ సామాజిక వర్గం అభ్యర్థుల రేసులలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి నారా బోయిన రవి తదితరులు టిక్కెట్లు ఆశిస్తున్నాను. అయితే పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా, ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కర్నె ప్రభాకర్ కు ఈసారి టికెట్ అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కూసుకుంట్లను కాదని, బీసీ సామాజిక వర్గ నేతకు టికెట్ కేటాయిస్తారా? లేదా ??అన్న దానిపై తర్జన, భర్జనలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి …
- అధికారులను బెదిరిస్తున్న కూసుకుంట్ల? మునుగోడు తహశీల్దార్..
- నవంబర్‌లో మునుగోడు ఉప ఎన్నిక…. ???
- ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా… ఆమోదించిన స్పీకర్
- మునుగోడు నియోజకవర్గంలో కీలకంగా వేనేపల్లి! మద్దతు కోసం అన్ని పార్టీల ప్రయత్నాలు..
- మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..
4 Comments