
క్రైమ్ మిర్రర్, నల్గొండ : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడే కీలకంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బైపోల్ ను సెమీఫైనల్ గా భావిస్తున్నారు. దీంతో మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో చివరగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపణి విపరీతంగా జరిగింది. అధికార పార్టీ వందల కోట్లు రూపాయలు ఖర్చు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. టీఆర్ఎస్ కు ధీటుగా ఈటల రాజేందర్ కూడా భారీగానే ఖర్చు చేశారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఓటుకు 6 వేల నుంచి 10 వేలకు పంచింది. మద్యం అదనం. బీజేపీ కూడా ఓటుకు మూడు నుంచి 10 వేల వరకు పంచిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మునుగోడు హుజురాబాద్ కంటే పార్టీలకు అత్యంత కీలకం. హుజురాబాద్ లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగగా.. మునుగోడులో మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు సాగనుందు. బీజేపీ నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండనున్నారు. దీంతో హుజురాబాద్ కంటే ఎక్కువగా కాసుల వర్షం కురుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read More : టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని పార్టీ నేతల డిమాండ్
మునుగోడు ఉప ఎన్నికపై తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్ పాలనను తరిమికొట్టేందుకు ధర్మయుద్ధం ప్రారంభమైందని, అందుకే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు ఏకం కావాలని సంజయ్ పిలుపునిచ్చారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా చౌటుప్పల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచారని, వారికి గుణపాఠం చెప్పేందుకు మునుగోడు ఓటర్లు కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమికి, బీజేపీ అధికారంలోకి రావడానికి మునుగోడు ఉప ఎన్నిక కీలకమని, తెలంగాణ భవిష్యత్తును మునుగోడు ఉప ఎన్నిక నిర్ణయిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Read More : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా?
మునుగోడు నియోజకవర్గానికి కేంద్ర నిధుల వివరాలను తెలియజేస్తూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి, ప్రతి వీధికి యువత వెళ్లి కేసీఆర్ నియంతృత్వ పాలనను వివరించాలని విజ్ఞప్తి చేశారు, ఏడ్చే తల్లి తెలంగాణను టీఆర్‌ఎస్ బారి నుంచి విముక్తి చేయాలని బండి సంజయ్ కోరారు.ప్రతి ఓటుకు రూ.30 వేల చొప్పున వెచ్చించి గెలిపించాలని సీఎం భావిస్తున్నారని, డబ్బులు తీసుకుని టీఆర్‌ఎస్‌ను ఓడించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను తెరకెక్కిస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చామని, అదే చేశామని కరీంనగర్ ఎంపీ , బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. నక్కల గండి ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న కేసీఆర్ హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మంచి రోడ్లు లేవని ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీళ్లు ప్రజలకు అందడం లేదని, దీని కోసం కేసీఆర్ రూ.40 వేల కోట్లు వృధా చేశారని ఆరోపించారు. బీజేపీ ఒత్తిడితోనే సీఎం గట్టుప్పల్ మండలంగా ప్రకటించారని సంజయ్ అన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలోరాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ గట్టుప్పల్ మండలంగా ప్రకటించారని బండి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి? ఎమ్మెల్సీగా కూసుకుంట్ల, కర్నెలో ఒకరికి ఛాన్స్?
- మునుగోడు టీఆర్ఎస్ ఇంచార్జ్ గా హరీష్ రావు.. పీకే టీమ్ సర్వే ఆధారంగానే అభ్యర్థి ఎంపిక
- తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్! విజయశాంతి సంచలనం..
- క్రిమినల్ కేసుల టాప్ లిస్టులో సీఎం కేసీఆర్!
- సెప్టెంబర్ లోనే మునుగోడు ఉప ఎన్నిక! రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ సిగ్నల్..
One Comment