
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ నూతన జవసత్వాలు అద్దుకుంటోంది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపుతో రాష్ట్ర ప్రజలు, నాయకులు ఒక్కసారిగా బీజేపీవైపు మొగ్గు చూపసాగారు. బీజేపీ అగ్రనాయకత్వం ఊహించని రీతిలో ఆ పార్టీలోకి నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఆల్రెడీ కమలం గూటిలో చేరిపోయారు. ఇదే కోవలో సహజనటి జయసుధ కూడా కమలం పార్టీలో చేరేందుకు ఉత్సుకత చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More : మునుగోడు టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీ నేతల డిమాండ్
జయసుధతో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ చర్చలు జరిపి, బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. అయితే తాను పార్టీలో చేరాలంటే కొన్ని డిమాండ్లు నెరవేర్చాలని కమలం పార్టీ నేతలను జయసుధ కోరారట. తనకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవి, కోరుకున్నచోట పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అడిగినట్లు వినికిడి. వీటికి అగ్రనాయకత్వం అంగీకరిస్తే బీజేపీలో చేరేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 21న అమిత్‌షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనుండటంతో, అన్నీ కుదిరితే జయసుధ కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున జయసుధ గెలుపొందారు. 2014లో ఓటమి తర్వాత ఆమె క్రమంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జయసుధ బీజేపీలో చేరితే ఆ పార్టీకి సినీగ్లామర్ కూడా తోడై, నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సహంగా పనిచేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి …
- సెప్టెంబర్ లోనే మునుగోడు ఉప ఎన్నిక! రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ సిగ్నల్..
- మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి? ఎమ్మెల్సీగా కూసుకుంట్ల, కర్నెలో ఒకరికి ఛాన్స్?
- రాహుల్ ముందే రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్!
- డ్రగ్స్ పార్టీలో రేవంత్‌రెడ్డి మేనల్లుడు!
- సోనియాతో టీడీపీ ఎంపీల భేటీ.. బాబుకు బీజేపీ హ్యాండిచ్చిందా?