
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : తెలంగాణ రాజకీయాన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సోమవారం అసెంబ్లీ స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వనున్నారు. రాజగోపాల్ రెడ్డి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయనున్నారు కాబట్టి ఆమోదం లాంఛనమే. మునుగోడు అసెంబ్లీకి ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. నవంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో వాటితో పాటు మునుగోడు ఉప ఎన్నిక జరగవచ్చని అంచనా వేస్తున్నారు. మూడు నెలల్లోనే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలన్ని మునుగోడుపై ఫోకస్ చేశాయి. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. నియోజకవర్గంలో బలమైన నేతలను గుర్తించి ఆకర్షించే పనిలో పడ్డాయి. మునుగోడు ఉప ఎన్నికలో నాంపల్లి మండలానికి చెందిన వేనేపల్లి వెంకటేశ్వరరావు కీలకంగా మారనున్నారనే ప్రచారం సాగుతోంది.
Read More : నాంపల్లి సీఐ శంకర్ రెడ్డి పై బదిలీ వేటు.
వేనేపల్లి వెంకటేశ్వరరావు గతంలో తెలుగు దేశం పార్టీలో యాక్టివ్ గా పని చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అనుచరులు ఉన్నారు. మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, చండూరు మండలాల్లో వేనేపల్లికి గట్టు పట్టింది. టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినా పొత్తులతో సాధ్యం కాలేదు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వేనేపల్లి గులాబీ పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. మంత్రి హరీష్ రావుతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. 2018లో టీఆర్ఎస్ టికెట్ రేసులో నిలిచారు. ఈ నేపథ్యంలోనే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఆయనకు విభేదాలు వచ్చాయి. కూసుకుంట్లకు వ్యతిరేకంగా తన అనుచరులతో బల ప్రదర్శన కూడా చేశారు. దీంతో వేనేపల్లిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసి అతనిపై సస్పెన్షన్ వేటు పడేలా చేశారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు.
Read More : 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం? ఏ పార్టీలో చేరబోతున్నారో?
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక రానుండటంతో మళ్లీ అందరి చూపు వేనేపల్లిలో పడింది. మూడు మండలాల్లో తీవ్ర ప్రభావం చూపగలికే వేనేపల్లి వెంకటేశ్వరావు మద్దతు కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అనుచరులు కొందరు ఇప్పటికే ఆయనతో మాట్లాడారని, కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. కమలం పార్టీ నేతలు కూడా వేనేపల్లిని తమ పార్టీలో చేర్చుకునేలా కసరత్తు చేస్తున్నారట, అయితే వేనేపల్లి మాత్రం కాంగ్రెస్, బీజేపీల ఆఫర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పలేదని సమాచారం. టీఆర్ఎస్ లో తనకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితోనే తనకు విభేదాలు ఉన్నాయని.. కూసుకుంట్ల కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా పని చేస్తానని ఆయన తన అనుచరులతో చెబుతున్నారని తెలుస్తోంది. వేనేపల్లిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అగ్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలో మళ్లీ తనకు టికెట్ కావాలని అడుగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో తాను విభేదించిన నేతలను కలిసి మద్దతు కోరుతున్నారట. వేనపల్లి వెంకటేశ్వరరావును కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కూసుకుంట్ల కోరనున్నారని అంటున్నారు. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికతో వేనేపల్లి వెంకటేశ్వరరావు కీలకంగా మారగా.. ఆయన అడుగులు ఎటువైపు పడతాయన్నది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి …
- దాసోజు శ్రావణ్ పోటీ చేసేది అక్కడి నుంచే?
- మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..
- మునుగోడులో కూసుకుంట్లకు చెక్.. ఏకమైన టీఆర్ఎస్ బీసీ నేతలు
- కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన అద్దంకి దయాకర్
- గాలి తప్ప అన్నిటిమీదా పన్నే!.. పాలపై జీఎస్టీ ఎత్తేయాలని కేసీఆర్ డిమాండ్
3 Comments