
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీళ్లకు గట్టి పట్టుంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన కోమటిరెడ్డి సోదరులు దూకుడు రాజకీయాలతో జనాల్లో మాస్ లీడర్లుగా పేరు సంపాదించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వ్యాపారవేత్తగా ఉంటూ వైఎస్సార్ హయాంలో 2009లో రాజకీయ అరంగ్రేటం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… పార్టీలో చేరిన వెంటనే భువనగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో మళ్లీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా.. తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో మునుగోడు అసెంబ్లీ నుంచి పోటీచేసి గెలిచారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈనెల 21న బీజేపీలో చేరబోతున్నారు.
Read More : మునుగోడు నియోజకవర్గంలో కీలకంగా వేనేపల్లి! మద్దతు కోసం అన్ని పార్టీల ప్రయత్నాలు..
కొన్ని రోజులుగా తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులు ఎంతనే విషయం చర్చగా మారింది. రాజగోపాల్ రెడ్డి పలు కన్స్‌ట్రక్షన్ కంపెనీల ఉన్నాయి. తెలంగాణలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు.2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన ఆస్తులు రూ. 300 కోట్లు. 2019 వరకు చేసిన ఆదాయపు పన్ను చెల్లింపులలో అతని ఆస్తులు 371% బాగా పెరిగాయని సూచించింది. రాజగోపాల్ రెడ్డి ఆస్తుల్లో 5.01 కోట్ల విలువైన నగదు, నగలు, కార్లు ఉన్నాయి. అయన భార్య కె.లక్ష్మి రూ. 261.84 కోట్ల విలువైన సంపదను కలిగి ఉంది. రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో రూ. 258 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు.
Read More : మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..
రాజగోపాల్ రెడ్డి సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులను చూస్తోంది. రాజ గోపాల్ రెడ్డికి 35 లక్షల విలువైన 1,080 గ్రాముల బంగారం, ఆయన భార్య వద్ద రూ.1,38,17,554 విలువైన 3,996 గ్రాముల బంగారం. రూ.6,80,850 విలువైన 20 కిలోల వెండి, రూ.50 లక్షల విలువైన 30 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. ఆయన స్థిరాస్తుల విలువ రూ.19,54,30,850, మరియు 27,91,18,60 ఉన్నాయి. మెదక్, నల్గొండ, రంగారెడ్డిలలో పెద్ద మొత్తంలో భూమిని కలిగి ఉన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్, సైబర్ స్పాజియోలో పెట్టుబడులు పెట్టారు. రాజగోపాల్ రెడ్డి, ఆయన భార్య లక్ష్మి ఇద్దరూ వాటాదారులుగా ఉన్న కంపెనీల ద్వారా 26 ప్రభుత్వ కాంట్రాక్టులు ఉన్నాయి. రాజ గోపాల్ రెడ్డి మొత్తం సంపద రూ. 24.55 కోట్లు కాగా, ఆయన భార్య ఆస్తుల విలువ రూ. 289.75 కోట్లు. వీరికి మొత్తంగా రూ. 314.31 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. ఇటీవల ఆయన కుమారుడి సారథ్యంలోని కంపెనీకి 18 వేల కోట్ల రూపాయల భారీ కాంట్రాక్ట్ లభించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం కారణంగానే ఆయన ఆ పార్టీలోకి వెళ్లారని విపక్షాలు ఆరోపించాయి.
ఇవి కూడా చదవండి …
- నల్గొండ కలెక్టర్ గా వినయ్ కృష్ణ రెడ్డి.. మునుగోడు ఉపఎన్నిక కోసమేనా?
- నవంబర్‌లో మునుగోడు ఉప ఎన్నిక…. ???
- ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా… ఆమోదించిన స్పీకర్
- దాసోజు శ్రావణ్ పోటీ చేసేది అక్కడి నుంచే?
- మునుగోడులో కూసుకుంట్లకు చెక్.. ఏకమైన టీఆర్ఎస్ బీసీ నేతలు
- కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన అద్దంకి దయాకర్
One Comment