
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ కమలం పార్టీలో చేరారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ కి బిజెపి పార్టీ సభ్యత్వం ఇచ్చారు తరుణ్ చుగ్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీలో చేరిన దాసోజ్ శ్రవణ్ కు వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ పెద్దల నుంచి హామీ లభించిందని తెలిసింది. తెలంగాణ ఉద్యమం నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా రాజకీయం చేశారు శ్రవణ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఖైరతాబాద్ కేంద్రంగానే ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు. గ్రేటర్ లో రాజకీయం చేస్తున్న దాసోజు శ్రవణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు. ఆయన సొంతూరు భువనగిరి అసెంబ్లీ పరిధిలో ఉంది.
Read More : కోమటిరెడ్డి సోదరుల ఔట్… కంచర్ల బ్రదర్స్ ఇన్?
2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు దాసోజు శ్రవణ్. తన వాగ్దాటితో కొద్ది కాలంలోనే చిరంజీవి, పవన్ కల్యాణ్ కు దగ్గరయ్యారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాసోజుకు 91 వేల ఓట్లు వచ్చాయి. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా కొద్ది కాలానికే కేసీఆర్, కేటీఆర్ కు బాగా క్లోజ్ అయ్యారు. వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ఆశించారు శ్రవణ్. కేసీఆర్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి జాతీయ అధికార ప్రతినిధిగా ఎదిగారు.
Read More : మునుగోడు ఉపఎన్నిక.. అదిరిపోయే వ్యూహాన్ని రచిస్తున్న కేసిఆర్
దాసోజు శ్రవణ్ కు సంబంధించి బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఖైరతాబాద్ బీజేపీ ఇంచార్జ్ గా చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయనను కాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ దాసోజుకు ఇచ్చే అవకాశం లేదు. అందుకే శ్రవణ్ సొంతూరైన భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ పెద్దలు అంగీకరించారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు శ్రవణ్ కోరుకున్నది కూడా ఇదే సీటు. ఒక వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్జి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సికింద్రాబాద్ ఎంపీ సీటుకు శ్రవణ్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. మొత్తంగా భువనగిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ నుంచి బీజేపీ తరపున దాసోజు శ్రవణ్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే సికింద్రాబాద్ కంటే తన సొంత ప్రాంతమైన భువనగిరి నుంచి పోటీ చేయడానికే శ్రవణ్ ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..
- మునుగోడులో కూసుకుంట్లకు చెక్.. ఏకమైన టీఆర్ఎస్ బీసీ నేతలు
- కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన అద్దంకి దయాకర్
- గాలి తప్ప అన్నిటిమీదా పన్నే!.. పాలపై జీఎస్టీ ఎత్తేయాలని కేసీఆర్ డిమాండ్
- నాంపల్లి సీఐ శంకర్ రెడ్డి పై బదిలీ వేటు.