
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ విజయం కోసం అదిరిపోయే వ్యూహాన్ని రచిస్తున్న కేసిఆర్ ఇప్పటికే మునుగోడు కు సంబంధించి ఐప్యాక్ బృందంతో పాటు, ఇతర సర్వే సంస్థలు, ప్రభుత్వ నిఘా విభాగాలు ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసి, టిఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక పార్టీకి నష్టం చేసింది అని భావించిన నేపథ్యంలో ఈసారి అభ్యర్ధి విషయంలో ఆచితూచి వ్యవహరించనున్నారు.
Also Read : మునుగోడులో కాంగ్రెస్ హ్యాండ్సప్… హుజురాబాద్ ఫలితం వచ్చినా ఫర్వాలేదన్న రేవంత్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈసారి టీఆర్ఎస్ జెండా ఎగుర వేయాలి అని భావిస్తున్న టిఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ముందుకు సాగుతుంది. మునుగోడు ఉపఎన్నికపై ప్రధానంగా దృష్టి సారించిన సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తూ గతానికి భిన్నంగా మునుగోడు ఉపఎన్నిక స్ట్రాటజీని రూపొందిస్తున్నారు.
Read Also : నీచ్ కమీన్ కుత్తే గాడు..ఈ రాజగోపాల్ రెడ్డి ! చండూరు సభలో రేవంత్ రెడ్డి నిప్పులు
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తో పాటు పలువురు నేతలు గులాబీ బాస్ కేసీఆర్ ను కలిశారు. మునుగోడు నియోజకవర్గంలో టిక్కెట్ ఇచ్చే విషయంలో కేసీఆర్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను, ఓటర్లను, టిఆర్ఎస్ కేడర్ మనోగతాన్ని, స్థానిక సంస్థల్లో టిఆర్ఎస్ బలాన్ని, పార్టీ పరంగా ఉన్న స్థానిక బలాన్ని అంచనా వేస్తూ, లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కి తాజా పరిణామాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ అనేకమార్లు పిలిచి మాట్లాడి దిశానిర్దేశం చేశారు.
Also Read : తనను పార్టీ నుంచి వెల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇక తాజాగా టీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు శుక్రవారం ప్రగతి భవన్లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. రెండు విడతల్లో సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కెసిఆర్ వారికి మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సేకరించాల్సి సమాచారంపై, అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. హడావుడిగా ప్రజల్లోకి వెళ్లి పరిస్థితులు తెలీకుండా కష్ట పడే బదులు, క్షేత్ర స్థాయిలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకొని, అధ్యయనం చేసిన తర్వాతనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కెసిఆర్ సూచిస్తున్నారు.
Read Also : కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా…
గతంలో నల్గొండ జిల్లాలో సక్సెస్ అయిన హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలను ప్రస్తావించి అప్పుడు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, వాటి ఫలితాలపై చర్చించారు. ఈసారి ముముగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరవెయ్యటమే టార్గెట్ అని చెప్పారు. ఇక మునుగోడులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయడంతో పాటుగా, ప్రత్యర్థి పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే బలమైన నేతలకు ఎలాగా వెయ్యాలి అన్న దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి నేడు కూడా మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ చర్చలు జరపనున్నారు. ఏదేమైనా ఈ సారి దూకుడుగా కాకుండా, పక్క ప్లాన్ గా వ్యూహాత్మకంగా గులాబి బాస్ మునుగోడుపై ఫోకస్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
- విపక్షాల అభ్యర్ధికే టీఆర్ఎస్ మద్దతు… బీజేపీ నేతల చేతికి కొత్త అస్త్రం
- ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్…
- రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్థానంలో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి
- 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం? ఏ పార్టీలో చేరబోతున్నారో?
One Comment