
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారతదేశ 16 వ ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే కూటమి తరుపున పచ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ 71 ఏళ్ల వయసున్న జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ 80 ఏళ్ల వయసున్న మార్గరెట్ ఆల్వా పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది. మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్‌ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. జేడీయూ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు ఎన్డీయే అభ్యర్థికి ఉంది.
Read Also : విపక్షాల అభ్యర్ధికే టీఆర్ఎస్ మద్దతు… బీజేపీ నేతల చేతికి కొత్త అస్త్రం
తమతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు అభ్యర్థిని ఖరారు చేశారన్న ఆగ్రహంతో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించింది. నామినేటెడ్ సభ్యులకి కూడా ఓటు హక్కుంది. ఉభయ సభల్లోనూ 788 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందరూ ఎంపీలే కావడంతో వారి ఓటు విలువ సమానంగా ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. జేడీయూ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. టీఎంసీకి లోక్‌సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యుల బలం ఉండడం, విపక్ష పార్టీల్లో నెలకొన్న అనైక్యతతో జగ్‌దీప్ విజయం దాదాపుగా ఖరారైపోయింది.
ఇవి కూడా చదవండి :
- మునుగోడులో కాంగ్రెస్ హ్యాండ్సప్… హుజురాబాద్ ఫలితం వచ్చినా ఫర్వాలేదన్న రేవంత్
- నీచ్ కమీన్ కుత్తే గాడు..ఈ రాజగోపాల్ రెడ్డి ! చండూరు సభలో రేవంత్ రెడ్డి నిప్పులు
- తనను పార్టీ నుంచి వెల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా…
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
One Comment