
క్రైమ్ మిర్రర్, నల్లగొండ నిఘా ప్రతినిధి : జిల్లాలోని నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శంకర్ రెడ్డి పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. గతంలో మర్రిగూడ, చింతపల్లి, మల్లెపల్లి మండలాలకు ఎస్ఐగా పని చేసిన శంకర్ రెడ్డికి, చింతపల్లి మండలానికి చెందిన చోటా నహీంతో స్నేహపూర్వక సంబంధాలు ఉండటం, తిరిగి ఇదే సర్కిల్ కి సిఐగా వచ్చి సదరు వ్యక్తికి పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు ప్రజలు అనుకుంటున్నారు. నాంపల్లి సినిమా ధియేటర్ ల్యాండ్ ఇష్యూలో కూడా 25 లక్షల రూపాయలు తీసుకున్నట్లు, మాల్ పట్టణ ప్రాంతంలో ఓ గుట్కా వ్యాపారి వద్ద 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు, మాడ్గుల మండలం నుండి తరలిస్తున్న బంక మట్టి రవాణా వారి వద్ద కూడా డబ్బు మూటలు అందాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం కరారు….
మర్రిగూడ మండల పరిధిలో లెంకలపల్లి గ్రామం నందు భూ పంచాయతీ విషయంలో సదరు ఫిర్యాదుదారుని వద్ద నుండి, నార్కట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అడ్డం పెట్టుకొని లక్ష యాభై వేల రూపాయలు కమాయించాడని ప్రజలు అనుకుంటున్నారు. సరంపేట గ్రామం ఘర్షగడ్డ వద్ద నూతనంగా నిర్మిస్తున్న పత్తి మిల్లు భూ సమస్యలో కూడా పది లక్షలు దండుకున్నట్లు తెలుస్తుంది. ఒక సర్కిల్ అధికారిగా ఉన్న ఒక అధికారి ప్రభుత్వ జీతంతో మన్నెగూడ పట్టణం నందు సుమారు రెండు కోట్ల విలువ గల ఇల్లు కట్టుకోవటం సాధ్యమేనా అంటూ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సర్కిల్ లో ఉన్న ప్రతి సమస్య తన వద్దకే రావాలనే విధంగా వాతావరణం ఏర్పరచుకుంటాడని వినికిడి. ఎస్సై ల పోస్టింగ్ ల కొరకై పైరవీలు చేస్తూ పోస్టింగులు ఇప్పిస్తాడని, తన చెప్పు చేతల్లో ఉండే వారిని తన సర్కిల్ లో ఉంచాలనే తాపత్రయపడతాడని, తన మాట వినని ఎస్సై లపై రిపోర్ట్ పెడుతూ, సస్పెండ్ చేపిస్తారనే ఆరోపణలు గట్టిగా వినబడుతున్నాయి. ఈ తరహాలో తన సర్కిల్ లో ఆల్రెడీ ఒక దూతను ఏర్పరచుకున్నాడని అనుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ సర్కిల్ లో ఉన్న మండలాలకు ఎస్ఐగా పని చేసినందున రియల్ బ్రోకర్లు ఆయన కనుసన్నలో పని చేస్తారని అనుకుంటున్నారు. తన మాట వినని ఎస్సై లపై ప్రజల్లో చెడు అభిప్రాయం ఏర్పడేలా ఎస్సైలను ప్రజల ముందే తిట్టి, ఆ పంచాయతీలన్ని తనే తీర్చి వసూళ్లకు పాల్పడతాడని అంటున్నారు.
Read Also : కోమటిరెడ్డి సోదరుల ఔట్… కంచర్ల బ్రదర్స్ ఇన్?
మొన్న డిఎస్పి కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ఈ పెద్ద సారు పాత్ర కూడా ఉందని అంటున్నారు. ఉన్నతమైన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ, రియల్ బ్రోకర్లకు అండగా ఉండటమే కాకుండా, తను కూడా రియల్ ఎస్టేట్ భూ దందాలు చేసేవాడని అనుకుంటున్నారు. వెంకటంపేట, చిట్యాల ప్రాంతాలతో పాటు పలు గ్రామాలలో తన బినామీ వ్యక్తుల పేర్లపై భూములు ఉన్నాయని, ఇలా డ్యూటీని పక్కన పెట్టి దందాలు చేస్తాడని, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఐ హైదరాబాద్ లో ఉంటున్నాడని అంటున్నారు. మంగళపల్లి నుండి బొంగులూరు గేట్ మధ్యన ఉన్న ఒక హోటల్ నందు సెటిల్మెంట్ లు, లావాదేవీలు నడిపేవాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా బదిలీతోనే సరిపెట్టకుండా అక్రమ ఆస్తులపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ సిఐ వ్యవహారంపై మొదట్లోనే క్రైమ్ మిర్రర్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో శంకర్ రెడ్డి పై చర్యలు తీసుకున్న జిల్లా ఎస్పి రమా రాజేశ్వరికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమార్కులపై సింహ స్వప్నంలా వ్యవరించిన తన సిన్సియారిటీ పై ప్రజలు పొగడ్తల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి :
- జనసేనలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్…
- మునుగోడు ఉపఎన్నిక.. అదిరిపోయే వ్యూహాన్ని రచిస్తున్న కేసిఆర్
- మునుగోడులో కాంగ్రెస్ హ్యాండ్సప్… హుజురాబాద్ ఫలితం వచ్చినా ఫర్వాలేదన్న రేవంత్
- నీచ్ కమీన్ కుత్తే గాడు..ఈ రాజగోపాల్ రెడ్డి ! చండూరు సభలో రేవంత్ రెడ్డి నిప్పులు
- తనను పార్టీ నుంచి వెల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
One Comment