
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : పోయిన చోటే వెతుక్కోవాలన్నది పెద్దల నానుడి. అందుకే ఏ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తన నాయకత్వాన్ని ప్రశ్నించారో, ఆ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే తన రాజకీయ చాణక్యాన్ని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రదర్శించబోతున్నారా? అంటే అవుననే రాజకీయ వర్గాల నుంచి సమాధానం వినిపిస్తుంది. టిపిసిసి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, తనకు మింగుడు పడని కోమటిరెడ్డి సోదరులలో ఒక్కరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా, ఇక ఎంపీ , పార్టీ స్టార్ క్యాంపెయినర్ బయటకు పంపేందుకు రేవంత్ వర్గీయులు ప్రయత్నాలను చేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులు పార్టీని వీడినా తమకు నష్టం లేదని భావిస్తున్నరు రేవంత్ వర్గీయులు.
Also Read : మునుగోడు ఉపఎన్నిక.. అదిరిపోయే వ్యూహాన్ని రచిస్తున్న కేసిఆర్
కోమటిరెడ్డి సోదరులిద్దరూ కాంగ్రెస్ ను వీడితే, ఆ స్థానాన్ని టిఆర్ఎస్ లో కొనసాగుతున్న కంచర్ల బ్రదర్స్ తో భర్తీ చేయాలన్నది రేవంత్ వర్గీయుల వ్యూహంగా కనిపిస్తోంది. 2018 లో నల్లగొండ అసెంబ్లీ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధించగా, రానున్న ఎన్నికల్లో మునుగోడు నుంచి తెరాస టికెట్ ను దక్కించుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై విజయం సాధించాలన్న లక్ష్యంతో కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు, కృష్ణారెడ్డి మునుగోడు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు తన సొంత నిధులను ఖర్చు చేస్తున్నారు. రేవంత్ తో కంచర్ల బ్రదర్స్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని వారిని పార్టీలోకి ఆహ్వానించాలన్నది రేవంత్ తో పాటు, ఆయన వర్గీయుల స్కెచ్ గా కనిపిస్తుంది. చూడాలి మరి… వెంకట్ రెడ్డి పార్టీని వీడితే కానీ, కంచర్ల సోదరులు కాంగ్రెస్ లో చేరేది లేనిది తేలనుంది.
ఇవి కూడా చదవండి :
- ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్…
- మునుగోడులో కాంగ్రెస్ హ్యాండ్సప్… హుజురాబాద్ ఫలితం వచ్చినా ఫర్వాలేదన్న రేవంత్
- నీచ్ కమీన్ కుత్తే గాడు..ఈ రాజగోపాల్ రెడ్డి ! చండూరు సభలో రేవంత్ రెడ్డి నిప్పులు
- తనను పార్టీ నుంచి వెల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా…
3 Comments