
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల బలపర్చిన మార్గరేట్ అల్వాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న మార్గరేట్ అల్వా నేరుగా పోటీలో ఉండటంతో..ముఖ్యమంత్రి తటస్థంగా వ్యవహరించి..తాము బీజేపీ – కాంగ్రెస్ సమదూరం పాటిస్తామనే సంకేతాలు ఇస్తారనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా మార్గరేట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రేపు (శనివారం) ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
Also Read : నేడు ఢిల్లీకి బండి సంజయ్… ప్రజా సంగ్రామయాత్రకు తాత్కాలిక విరామం
బీజేపీ నుంచి పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పని చేసిన ధన్ కర్ ను బరిలోకి దింపింది. అయితే, కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో ఉండటంతో… సీఎం కేసీఆర్ తో రాజకీయంగా మద్దతుగా నిలుస్తున్న టీఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకుంది. అయితే, ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం..తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి అస్త్రంగా మారుతుందా అనే చర్చ మొదలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం హైదరాబాద్ కు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు. అదే సమయంలో.. సిన్హా నేరుగా సీఎం కేసీఆర్ ను కలవటంతో…ఆయన్ను కలిసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ నిరాకరించారు.
Read Also : రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్థానంలో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి
ఇప్పుడు జాతీయ రాజకీయాల దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్న సమయంలో.. బీజేపీని వ్యతిరేకించే పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్ధి..దక్షిణాదికి చెందిన మార్గరేట్ అల్వాను బరిలోకి దించటంతో.. మద్దతుగా నిలవాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సహా పలువురు సీనియర్లు కోరినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఈడీ విచారణకు పిలిచిన సమయంలోనూ..కేంద్రం తీరుకు వ్యతిరేకంగా విపక్షాలు సమావేశమై.. సంయుక్తంగా ఖండించాయి. ఒక నోట్ విడుదల చేశాయి. ఆ సమయంలోనూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు సంతకాలు చేశారు. రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ కార్యక్రమంలో సిన్హాకు మద్దతు గా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
Also Read : నేడు చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ… తెలంగాణ ఇంటి పార్టీ విలీనం
ఆ సందర్భంలోనూ కాంగ్రెస్ తో కలిసి పని చేయటం పైన క్లారిటీ ఇచ్చారు. తాము యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నామని..అందులో ఏ పార్టీ ఉందో తమకు సంబంధం లేదని.. తాము కాంగ్రెస్ తో కలిసి లేమని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధికి మద్దతు ఇచ్చినట్లుగానే..ఇప్పుడు చివరి నిమిషం వరకు తర్జన భర్జన తరువాత విపక్షాల అభ్యర్ది మార్గరేట్ అల్వాకు మద్దతు ఇస్తూ టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పుడు దీని పైన బీజేపీ సహజంగానే టార్గెట్ చేసే అవకాశం ఉంది. అయితే..ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- 10 లక్షల సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే..
- ఆగస్టు 8న ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
- 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం? ఏ పార్టీలో చేరబోతున్నారో?
- తెలంగాణ రాష్ట్రంలో బిజేపి “ఆపరేషన్ ఆకర్ష్”….
- బీజేపీలో ‘ఆర్’ సెంటిమెంట్ .. కలిసొచ్చిన ‘ఆర్’ అక్షరం
One Comment