
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఆశలు వదులుకుందా? మునుగోడులోనూ కాంగ్రెస్ విజయావకాశాలు లేవా? అంటే తాజాగా చండూరు సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ కు గెలుపుపై ఆశలు లేవని తెలుస్తోంది. చండూరు సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మునుగోడులో ఎవరూ గెలిచినా తమకు నష్టం లేదన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చరిత్ర హీనుడని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ప్రతిష్టను అమిత్‌షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి.. రాజగోపాల్‌రెడ్డి 21 వేల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఉపఎన్నికలతో కాంగ్రెస్‌కు వెంట్రుక కూడా ఊడలేదని చెప్పారు.
2018 తర్వాత తెలంగాణలో నాలుగు ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. రెండు సీట్లలో దరిద్రపు బీజేపీ.. రెండు సీట్లలో ముదనష్టపు టీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. నాలుగు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా పార్టీ ఏమైనా నష్టం జరిగిందా అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయినా ఏమి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంట్రకను కూడా ఎవరూ పీకలేరన్నారు. దుబ్బాక, హుజురాబాద్ బీజేపీ గెలిస్తే ఏమైనా మార్పు వచ్చిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే మునుగోడులో ఎలాంటి ఫలితం వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగదన్నారు.మునుగోడులో కాంగ్రెస్ ఓడినా తమకేం కాదని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినవారికి గుణపాఠం చెప్పాలని పిలపునిచ్చారు.
మునుగోడులో ఎవరు గెలిచినా తమకు నష్టం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మనం ఖచ్చితంగా గెలుస్తామంటూ భరోసా కల్పించాలని కాని.. ఇలా ఓడిపోయినా ఏం కాదని చెప్పడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓటమి పదమే రేవంత్ రెడ్డి నోట రావొద్దని.. ఆయన అలా అన్నారంటే గెలుపుపై ఆయనకు ఆశలు లేవని తెలుస్తుందనే టాక్ వస్తోంది. ఓడిపోయినా ఏమి కాదంటూ రేవంత్ రెడ్డి మాట్లాడటంపై మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. చండూరు సభతో కేడర్ లో జోష్ వస్తుందని భావిస్తే.. రేవంత్ కామెంట్లతో అంతా రివర్స్ అయిందని కొందరు నేతలు అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- నీచ్ కమీన్ కుత్తే గాడు..ఈ రాజగోపాల్ రెడ్డి ! చండూరు సభలో రేవంత్ రెడ్డి నిప్పులు
- తనను పార్టీ నుంచి వెల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా…
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
- విపక్షాల అభ్యర్ధికే టీఆర్ఎస్ మద్దతు… బీజేపీ నేతల చేతికి కొత్త అస్త్రం
2 Comments