
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడవ విడత ప్రజా సంగ్రామయాత్రకు తాత్కాలిక విరామం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం జేపీ నడ్డా, అమిత్ షా ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేరిక, మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు సమాచారం.
Read Also : 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం? ఏ పార్టీలో చేరబోతున్నారో?
రాజగోపాల్‌ను పార్టీలోకి ఢిల్లీలో చేర్చుకోవాలా? లేక పాదయాత్ర సందర్భంగా మునుగోడులో కాషాయ కండువా కప్పలా అనే దానిపై కూడా సమాలోచనలు జరపనున్నారు. అలాగే పాదయాత్ర జరుగుతున్న తీరు, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను జాతీయ నేతలకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడులో వాస్తవ పరిస్థితులపై అమిత్ షా నివేదికలు తెప్పించుకున్నారు. ఉప ఎన్నిక కోసం కమలం పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.
ఇవి కూడా చదవండి :
- 10 లక్షల సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే..
- ఆగస్టు 8న ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
- తెలంగాణ రాష్ట్రంలో బిజేపి “ఆపరేషన్ ఆకర్ష్”….
- రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన సీతక్క..
- బీజేపీలో ‘ఆర్’ సెంటిమెంట్ .. కలిసొచ్చిన ‘ఆర్’ అక్షరం
One Comment