
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనుంది. పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న అభ్యర్ధులు పోటీపడి కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోయినంత మాత్రాన క్యాడర్ ఎక్కడికీ పోదని.. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని, శ్రేణుల్లో భరోసా నింపి మందుకెళ్లాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఈ సభ ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసందే. దీంతో కాంగ్రెస్ క్యాడర్ భరోసా సభకు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ సీఎల్పీ జానారెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వ్యవహరించానున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటి వెంకట్ రెడ్డి సభకు దూరంగా ఉన్నారు. ఆయన ఢిల్లీలోనే ఉన్నారు.
Read Also : ఆగస్టు 8న ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి మునుగోడును ఎట్టి పరిస్థితుల్లో చేజారకూడదనే ఏఐసీసీ ఆదేశాలతో టీపీసీసీ నాయకులు ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఇంటి పార్టీ విలీనానికి రంగం సిద్ధమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గురువారం ఢిల్లీలో ఏఐసీసీ నేతలో చర్చలు జరిపారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుధాకర్ గురువారం ఢిల్లీలోనే ఉన్నారు. రాహుల్‌గాంధీ చేతుల మీదుగా కండువా కప్పించుకుని, అనంతరం ఢిల్లీ నుంచి రేవంత్‌తో కలిసి మునుగోడు బహిరంగ సభకు రానున్నారు. చండూరులో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రకటన చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
- 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం? ఏ పార్టీలో చేరబోతున్నారో?
- 10 లక్షల సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే..
- తెలంగాణ రాష్ట్రంలో బిజేపి “ఆపరేషన్ ఆకర్ష్”….
- బీజేపీలో ‘ఆర్’ సెంటిమెంట్ .. కలిసొచ్చిన ‘ఆర్’ అక్షరం
- రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన సీతక్క…
3 Comments