
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడాన రేవంత్ రెడ్డి.. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డిని నీచ్ కమీన్ కుత్తే అంటూ మండిపడ్డారు. ఓ బ్రోకర్, లోఫర్.. కాంట్రాక్టర్ పార్టీ మారితే తమకు ఏం నష్టం లేదని కామెంట్ చేశారు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి అమిత్ షాకు అమ్ముడుపోయావని మండిపడ్డారు. సోనియాను ఈడీ అధికారులు ప్రశ్నిస్తుంటే.. సన్నాసి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా వంచన చేరాడని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ప్రజలను , సోనియా గాంధీని మోసం చేసిన రాజగోపాల్ రెడ్డి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.
Read More : మునుగోడులో కాంగ్రెస్ హ్యాండ్సప్… హుజురాబాద్ ఫలితం వచ్చినా ఫర్వాలేదన్న రేవంత్
రాజగోపాల్ రెడ్డి బుద్ది కుక్క తోక వంకర లాటిందన్నారు. ఉదయం ఒక మాట.. సాయంత్రం మరో మాట మాట్లాడే రాజగోపాల్ రెడ్డిని చూసి జనాలు మరో కేఏ పాల్ అంటూ నవ్వుకుంటున్నారని అన్నారు. ఉపఎన్నికతోనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అంటే.. రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయవచ్చు కదా అన్నారు. ఒక్క ఎమ్మెల్యే పోతే కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమి లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి లాంటి నయవంచ నాయకుడిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. నయవంచక, దుర్మార్గుడైన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు గడ్డపై పాతర వేద్దామని పిలుపిచ్చారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నాను కాబట్టే తనపై 120 కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి కింద తాను పని చేయాలా అంటున్న రాజగోపాల్ రెడ్డికి.. అమిత్ షా జైలుకు వెళ్లిన సంగతి తెలియదా అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి …
- తనను పార్టీ నుంచి వెల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా…
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
- విపక్షాల అభ్యర్ధికే టీఆర్ఎస్ మద్దతు… బీజేపీ నేతల చేతికి కొత్త అస్త్రం
- రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్థానంలో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి
2 Comments