
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పార్టీలో ఏం జరుగుతోందనే ఉత్కంఠ మొదలైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యవహారం ఇంకా పార్టీలో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాసోజు శ్రవణ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రస్తుతం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు బాధ కలిగిస్తున్నాయని తన సన్నిహితులతో వాపోయారు.
Also Read : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
గత ఎన్నికల్లో దాసోజు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ కార్పోరేటర్.. పీజేఆర్ కుమార్తె తిరిగి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో పాటుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన వాపోతున్నట్లుగా సమాచారం. అయితే, దాసోజు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారాల పైన పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారు. రేవంత్ సామాజిక వర్గాల వారీగా కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల సమయం నుంచి శ్రవణ్ కొంత మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తరువాత, శ్రవణ్ సైతం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇసందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నామని… పార్టీ కోసం పాటుపడిన తమనే బలహీనపరుస్తున్నట్లు అయన తెలిపారు. పార్టీలోకి భానిసలుగా బ్రతకడానికి చేరలేదని, మాఫియ తరహ రాజకీయాలు తెలంగాణ కాంగ్రెస్లో చేస్తున్నారని అయన తెలిపారు. ఇంతవరకు పార్టీ తరుపున సమీక్షలు కానీ, కమిటీలు గాని పెట్టలేదని ఎంతో భాధతో ప్రాదమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అతనా తెలిపారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
Read Also : విపక్షాల అభ్యర్ధికే టీఆర్ఎస్ మద్దతు… బీజేపీ నేతల చేతికి కొత్త అస్త్రం
వరుసగా పార్టీ వీడుతున్న నేతలు.. పార్టీలోని కొందరు టార్గెట్ చేస్తుండటంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఉక్కపోత తప్పటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. రేవంత్ కు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన సమయం నుంచి కొందరు సీనియర్లు సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. హైకమాండ్ జోక్యంతో ఒక్కొక్కరుగా దగ్గరవుతున్న వేళ..ఇప్పుడు సడన్ గా పార్టీలో పరిణామాలు మారిపోతున్నాయి. బీజేపీ యాక్టివ్ కావటంటో టీఆర్ఎస్ పైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్న వేళ..అనూహ్యంగా కాంగ్రెస్ లో వేగంగా సమీకరణాలు మారిపోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పరిస్థితి ఇలా ఉంటే..అటు ఢిల్లీలోనూ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వేడి కొనసాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అంశం సైతం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణహవుతోంది.
ఇవి కూడా చదవండి :
- నేడు ఢిల్లీకి బండి సంజయ్… ప్రజా సంగ్రామయాత్రకు తాత్కాలిక విరామం
- నేడు చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ… తెలంగాణ ఇంటి పార్టీ విలీనం రాజ్యసభ ఛైర్మన్
- వెంకయ్య నాయుడు స్థానంలో రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి
- 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం? ఏ పార్టీలో చేరబోతున్నారో?
- తెలంగాణ రాష్ట్రంలో బిజేపి “ఆపరేషన్ ఆకర్ష్”….