
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు వల వేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వలసల పర్వం జోరుగా సాగుతోంది. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించారు. కోమటిరెడ్డి బాటలోనే మరికొందరు నేతలు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా తమ పార్టీలోకి టీఆర్ఎస్ , బీజేపీ నేతలు చేరబోతున్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఉందని.. అది రోజురోజుకు పెరిగిపోతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో అధికార పార్టీకి చెందిన చాలా మంది నేతలు విపక్ష పార్టీల వైపు చూస్తున్నారని అంటున్నారు. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
Raed More : నేడు చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ… తెలంగాణ ఇంటి పార్టీ విలీనం
రెండు రోజుల క్రితం బీజేపీ చేరికల కమిటి కన్వీనర్ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని తనతో చర్చలు జరిపిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల వివరాలతో కూడిన జాబితాను ఈటల.. అమిత్ షాకు ఇచ్చారని తెలుస్తోంది. ఈటల జాబితాలో కీలక నేతలు ఉన్నారంటున్నారు. తాజాగా చేరికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దంగా ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండటతో వాళ్లంతా రాజీనామా చేయబోతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు బండి సంజయ్. ఇప్పటికే 10 నుంచి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై, తమ భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటున్నారన్నారు.
Read More : 70 శాతం ఓటర్లున్నా ఒక్కరు ఎమ్మెల్యే కాలే! మునుగోడులో ఈసారి బలంగా బీసీ వాదం
కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు బండి సంజయ్.. టీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని, మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని అన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీ(ని, మోదీ పథకాలను చాలా సందర్భాల్లో ప్రశంసించారని ప్రస్తావించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దనుందన్నారు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరోనంటూ ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- 10 లక్షల సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే..
- ఆగస్టు 8న ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా?
- తెలంగాణ రాష్ట్రంలో బిజేపి “ఆపరేషన్ ఆకర్ష్”….
- నేడు ప్రారంభం కానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్…
- రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన సీతక్క…
2 Comments