
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మించిన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతికతో కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి దాదాపుగా ఆరేళ్లు పట్టింది. ఈ సెంటర్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా ఉన్న 10 లక్షల సీసీటీవీ కెమెరాలను పోలీస్ శాఖ మానిటర్ చేస్తుంది. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తిన త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు ఇక్కడి నుంచే అన్ని విభాగాలను సమన్వయం చేస్తుంది. తద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టమవుతుంది.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే..
2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన, భూమిపూజ చేశారు.
ఈ సెంటర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసింది.
ఈ సెంటర్లో మొత్తం 6 లక్షల 42 వేల చదరపు అడుగుల నిర్మాణం
2.16 లక్షల చదరపు అడుగులు, సూపర్ స్ట్రక్చర్ ఏరియా 4.26 లక్షల చదరపు అడుగుల్లో ఉంది
కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మొత్తం ఐదు బ్లాక్‌లుగా నిర్మించారు.
టవర్ ‘ఏ’లో గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు 19 అంతస్తులు
టవర్ ‘బీ’లో రెండు బేస్‌మెంట్లు గ్రౌండ్‌ఫ్లోర్, 15 అంతస్తులు
టవర్ ‘సీ’లో ఆడిటోరియం గ్రౌండ్‌ఫ్లోర్, రెండు అంతస్తులు
టవర్ ‘డీ’లో గ్రౌండ్ ప్లస్ మొదటి అంతస్తు
టవర్ ‘ఈ’లో సీసీసీని 4 నుంచి 7 అంతస్తుల్లో ఏర్పాటు
అన్ని టవర్లలో ‘ఏ’ టవర్ ఎత్తయినది. దీనిలో మొత్తం 20 అంతస్తులు
టవర్ ఏ లోని నాల్గో అంతస్తులో డీజీపీ చాంబర్, 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చాంబర్
7వ అంతస్తులో ప్రముఖుల చాంబర్లు
టవర్ ఏ, బీలను 14వ అంతస్తులో కలుపుతూ 400 మెట్రిక్ టన్నుల బరువుతో దేశంలోనే అత్యంత బరువైన స్కైవాక్ వంతెన
స్కైవాక్ కు సోలార్ ఫొటోవోల్టిక్ ప్యానల్స్‌తో రూఫ్‌టాప్
నైరుతివైపు ఉన్న టవర్‌పైన హెలిపాడ్
వీవీఐపీ మూమెంట్స్ కోసం హెలికాప్టర్ సేవలను వాడుకోవచ్చు
టవర్లలోని కింది ఫ్లోర్లలో ఆడిటోరియం, కేఫ్, మల్టీపర్పస్ హాల్, మీడియా సెంటర్, రిసెప్షన్ లాబీ
టవర్ – ఏలో 550 వర్క్ స్టేషన్లు, వెయ్యి మంది సిబ్బంది
టవర్ బీలో 580 వర్క్ స్టేషన్లు, 1500 మంది సిబ్బంది
అన్ని ఫ్లోర్లలోనూ కిచెన్
ఆడిటోరియంను 590 మంది సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు
మొత్తంగా 600 కు పైగా వాహనాల పార్కింగ్ సౌకర్యం
టవర్ – డీ గ్రౌండ్ ఫ్లోర్‌లో 125 మంది కూర్చునే సామర్థ్యంతో మీడియా బ్రీఫింగ్ హాల్
నేరుగా అక్కడి నుంచే లైవ్ కవరేజ్ ఇచ్చేలా ఏర్పాట్లు
కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక డాటా సెంటర్ కోసం బెల్జియం, జర్మనీ నుంచి సర్వర్లు
దాదాపు 30 పెటా బైట్ల సామర్థ్యం ఉన్న స్టోరేజీ
10 లక్షల సీసీటీవీ కెమెరాల ఫీడ్ ఇందులో నిక్షిప్తం
ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాల ఫీడ్ చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్
తెలంగాణలోని అన్ని జిల్లాల సీసీటీవీల ఫీడ్, ఇతర సమాచారం హైదరాబాద్‌లోని సీసీసీకి అనుసంధానం
రాష్ట్రంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, సీసీటీవీల్లోని ప్రత్యేక స్టాఫ్ట్ వేర్ ద్వారా కెమెరాయే నేరుగా సీసీసీకి అలర్ట్
అక్కడ పాప్‌అప్ స్క్రీన్‌పై వస్తుంది. దీంతో వెంటనే సిబ్బంది అలర్ట్ అవుతారు
2 Comments