
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తాజాగా మునుగోడు ఎమ్మెల్యేగా, అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని, పీసీసీ పదవిని డబ్బులతో కొన్నాడని, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి అని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే మునుగోడులో బట్టలు విప్పి కొడతారు అంటూ రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడని రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు.
Also Read : నన్ను రెచ్చగొట్టొద్దు.. బీకేర్ ఫుల్! రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్
కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విమర్శించే అర్హత లేదని రాజగోపాల్ రెడ్డికి లేదని సీతక్క మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ పై పోరాటం చేయడం అబద్ధం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని పేర్కొన్నారు ఎమ్మెల్యే సీతక్క.
Read Also : 70 శాతం ఓటర్లున్నా ఒక్కరు ఎమ్మెల్యే కాలే! మునుగోడులో ఈసారి బలంగా బీసీ వాదం
తెలంగాణ కోసం కొట్లాడతాం అని చెప్పుకునే కొందరు ముసుగు వీరులు తమ ఆర్థిక లావాదేవీల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనే అవమానిస్తున్నారని మండిపడ్డారు . తమ అవసరాల కోసం మోడీ, అమిత్ షా ఇచ్చే కాంట్రాక్టుల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే విధంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక పక్క సోనియాగాంధీని ఈడీ వేధిస్తుంటే, కొంతమంది నాయకులు మోడీ, అమిత్ షా ల దగ్గరికి వెళ్లి కాంట్రాక్టులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : మునుగోడులో హుజురాబాద్ సీన్ రిపీట్ కానుందా??
ఈడీని మోడీ తన జేబులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని సీతక్క వెల్లడించారు. సోనియాగాంధీ ప్రతినిధిగా, మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి గెలిపించారని సీతక్క గుర్తు చేశారు. అలాంటి సోనియా గాంధీని అవమానించిన వారి పక్కన చేరిన వారిని ఉపేక్షించేది లేదని సీతక్క పేర్కొన్నారు. నిజమైన తెలంగాణ వాదులుగా చెప్పుకునే వారెవ్వరూ తెలంగాణ ను అడుగు అడుగున అడ్డు తగిలిన బీజీపీ పంచన చేరుతున్న రాజగోపాల్ రెడ్డిని ఆదరించరని సీతక్క పేర్కొన్నారు. గడిచిన 8 యేండ్ల బీజీపీ పాలనలో పేద ప్రజల పై గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని పేర్కొన్నారు. బిజెపికి ప్రజలే బుద్ది చెపుతారు అంటూ సీతక్క విమర్శించారు. మునుగోడుకు కావలసింది ఉపఎన్నిక కాదని, అభివృద్ధి మాత్రమే కావాలని పేర్కొన్న సీతక్క, మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి…
- మునుగోడు ఉపఎన్నిక… తెరపైకి కోత్త డిమాండ్లు…
- నిరుద్యోగులకు షాక్… సగానికి పైగా పోస్టులు వారితోనే భర్తీ !!
- పెద్దంపేట వాగులో ‘ఈతకు వెళ్లి యువకుడు మృతి’
- డ్రోన్ ‘ఎంక్యూ-9 రీపర్’ ను కొనుగోలు చేయనున్న భారత్…