
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారతీయ జనతా పార్టీలో ‘ఆర్’ సెంటిమెంట్ చాలా కాలంగా కనిపిస్తుంది. బిజెపి నుండి అసెంబ్లీ కి వెళ్లిన నేతల అందరి పేర్లు ఆర్ అక్షరం తో మొదలైనవే. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యే గా బిజెపి నుండి గెలుపొందారు రాజాసింగ్. ఆయన పేరు ఆర్ అక్షరం తోనే మొదలైంది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం సాధించారు. దీంతో బీజేపీలో తమకు ఆర్ అక్షరం కలిసి వచ్చింది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆపై బిజెపిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలలో సైతం ఈటల రాజేందర్ టిఆర్ఎస్ ధీటుగా తలపడి విజయం సాధించారు. ఇక హుజురాబాద్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే పేరు కూడా ఆర్ అక్షరంతో మొదలు కావడం బిజెపి తమకు కలిసి వచ్చిన అంశంగా భావించింది.
Also Read : నన్ను రెచ్చగొట్టొద్దు.. బీకేర్ ఫుల్! రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్
అసెంబ్లీలో ‘ఆర్ ఆర్ ఆర్’ అంటూ హల్ చల్ చేసింది బిజెపి. బిజెపి నుంచి ప్రస్తుతం ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు ఆర్ అక్షరం తోనే మొదలు కావడం, ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మరోమారు ఉపఎన్నిక జరగనుండటంతో మళ్లీ ‘ఆర్’ సెంటిమెంట్ పై బీజేపీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజాసింగ్ ను మినహాయిస్తే దుబ్బాక, హుజురాబాద్ రెండు ఉప ఎన్నికల్లోనూ బిజెపి నుండి బరిలోకి దిగిన రఘునందన్ రావు, రాజేందర్ అనూహ్య విజయాన్ని సాధించి బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చారు.
Read Also : 70 శాతం ఓటర్లున్నా ఒక్కరు ఎమ్మెల్యే కాలే! మునుగోడులో ఈసారి బలంగా బీసీ వాదం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి నుండి బరిలోకి దిగితే తప్పక విజయం సాధిస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ‘ఆర్’ సెంటిమెంట్ తమకు బాగా కలిసి వచ్చిందని బిజెపి నేతలు చెబుతుండడం గమనార్హం.
Also Read : మునుగోడులో హుజురాబాద్ సీన్ రిపీట్ కానుందా??
ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కూడా అదేవిధంగా బిజెపికి అనూహ్య విజయాన్ని చేకూరుస్తుందని, బిజెపి మరింత దూకుడుగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక ఆర్ అక్షరం తో ఉన్న సెంటిమెంటు పక్కనపెడితే, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకంగా భావించి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధిస్తూ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కూడా ఈసారి మునుగోడు నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగితే విజయం తథ్యం అన్న ధీమా బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
Read Also : రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి…
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తర్వాత, జరిగిన ఉప ఎన్నికలలో, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా అందులో ఒక్క నాగార్జునసాగర్ మాత్రమే బిజెపి దక్కించుకోలేకపోయింది. ఇక దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాలలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే పంథా కొనసాగుతుందని, ఒక పక్క ‘ఆర్’ సెంటిమెంట్, మరోపక్క ఉపఎన్నిక కలిసొస్తుందన్న భావన బిజెపి నేతలకు బలంగా ఉండటంతో ఈసారి కూడా విజయం తమ ఖాతాలోనే పడుతుందని బీజేపీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నారు. మరి బీజేపీ సెంటిమెంట్ ఈ దఫా మునుగోడు ఉపఎన్నికలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి :
- పెద్దంపేట వాగులో ‘ఈతకు వెళ్లి యువకుడు మృతి’
- మునుగోడు ఉపఎన్నిక… తెరపైకి కోత్త డిమాండ్లు…
- నిరుద్యోగులకు షాక్… సగానికి పైగా పోస్టులు వారితోనే భర్తీ !!
- మునుగోడు ఉప ఎన్నిక… మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం
- డ్రోన్ ‘ఎంక్యూ-9 రీపర్’ ను కొనుగోలు చేయనున్న భారత్….
One Comment