
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సిద్ధమైంది. వందల కోట్ల రూపాయలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ 19అంతస్తుల్లో నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ అధికారులు పూర్తి చేశారు.
Also Read : రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన సీతక్క…
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో కలికితురాయిగా మారనుంది. ఏడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న ఈ భారీ భవనం ఆగస్ట్ 4వ తేదిన సీఎం చేతుల మీదుగానే ప్రారంభం కానుంది. 585 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి నిర్మించిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ నిర్మించడం జరిగింది. 19 అంతస్తులతో నిర్మించబడిన ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భవన సముదాయం 18,19 అంతస్తుల్లో పర్యాటకులకు అనుమతినివ్వనున్నారు. హైదరాబాద్ నగరాన్ని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే చూసే విధంగా ఏర్పాట్లు చేశారు.
Read Also : బీజేపీలో ‘ఆర్’ సెంటిమెంట్ .. కలిసొచ్చిన ‘ఆర్’ అక్షరం
మెయిన్ ఎంట్రెన్స్, పోర్టీకో, గ్రాండ్ ఎంట్రీ, మ్యూజియం, ఆడిటోరియం, ఫ్లోర్ల పనులను పూర్తి చేశారు. ఎంట్రీ దగ్గర, కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు భాగం అంతా ఆకు పచ్చని మొక్కలతో గ్రీనరీగా మార్చారు. కంపౌండ్ వాల్ చుట్టూ వెదురు చెట్లు నాటారు. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర డివైడర్లు, గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేశారు. జిల్లా కేంద్రాల్లో ఎస్పీల దగ్గర ఉండే సీసీ టీవీ ఫుటేజ్‌ను ఈ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారని తెలుస్తోంది. ఇందుకు డేటా సెంటర్ కీలకం కానుంది. ప్రస్తుతానికి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాష్ట్ర హోం మంత్రి , డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చాంబర్లు రెడీ అయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే ఆపరేట్ అవుతుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు.
Also Read : నన్ను రెచ్చగొట్టొద్దు.. బీకేర్ ఫుల్! రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్
విదేశాల నుంచి డేటా పరికరాలు కొనుగోలు..ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కావాల్సిన డేటా సెంటర్ పరికరాలు జర్మనీ, బెల్జియం నుంచి రావాల్సి ఉంది. వాటి నిమిత్తం ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల చేయాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బిల్డింగ్ పనులు పూర్తయినప్పటికీ డేటా సెంటర్ పరికరాలు రానందున కమాండ్ కంట్రోల్ సెంటర్పూర్తి స్థాయిలో నిర్వహణలోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే సిటీలోని అన్ని సీసీ కెమెరాలను ఈ కేంద్రం నుంచి పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇందుకు ఓ ఫ్లోర్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ని ఏర్పాటు చేయనున్నారు.కరోనా కారణంగా జాప్యం..ఆరు సంవత్సరాల క్రితం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు జరుగుతున్నాయి. రూ.585 కోట్ల వ్యయంతో షాపూర్ జీ పల్లోంజి కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కరోనా కారణంగా నిర్మాణం విషయంలో జాప్యం జరిగినట్లుగా అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- 70 శాతం ఓటర్లున్నా ఒక్కరు ఎమ్మెల్యే కాలే! మునుగోడులో ఈసారి బలంగా బీసీ వాదం
- మునుగోడులో హుజురాబాద్ సీన్ రిపీట్ కానుందా??
- పెద్దంపేట వాగులో ‘ఈతకు వెళ్లి యువకుడు మృతి’
- నిరుద్యోగులకు షాక్… సగానికి పైగా పోస్టులు వారితోనే భర్తీ !!
- డ్రోన్ ‘ఎంక్యూ-9 రీపర్’ ను కొనుగోలు చేయనున్న భారత్….