
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పీసీసీ పదవిని రేవంత్ డబ్బులతో కొన్నాడని ఆరోపించారు. తెలంగాణలో పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీని ఖతం చేశాడని ధ్వజమెత్తారు. పీసీసీ ప్రెసిడెంట్ అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్లాన్ చేసుకున్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి చంద్రబాబుకు ఇచ్చాడని, స్పీకర్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికకు భయపడి ఉత్తుత్తి రాజీనామా చేశాడని ప్రస్తావించారు.
సోనియాగాంధీని తానెప్పుడూ అవమానపర్చలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సోనియాను బలిదేవత అన్నది రేవంత్ ఒక్కడేనని అన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, తెలంగాణలో ఉద్యమంలో ఏనాడైనా జైలుకెళ్లాడా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన వ్యాపారస్తులను బ్లాక్‌మెయిల్ చేస్తాడని ఆరోపించారు. వ్యాపారం చేయకుండానే ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని రేవంత్‌ను నిలదీశారు. సిగ్గుశరం ఉంటే బీజేపీతో కాంట్రాక్టు తీసుకున్నట్లు నిరూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. లేదంటే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. తాను దేనికైనా సిద్ధమేనని.. రేవంత్ బహిరంగ చర్చ సిద్ధమేనా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
Also Read : మునుగోడు ఉప ఎన్నిక… మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం
రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ ఇంకా చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. పీసీసీగానే కాదు.. ఏఐసీసీ ప్రెసిడెంట్ అయినా ఆయనను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. రేవంత్‌కు వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడలేదని, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ఏం చేశారని నిలదీశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
‘రేవంత్‌రెడ్డి బ్రాండ్‌నేమ్ బ్లాక్‌మెయిల్. జయశంకర్, కోదండరామ్‌ను తిట్టిన చరిత్ర నీది. వైఎస్సార్ మరణంపై కూడా విమర్శలు చేశాడు. సోనియాను తిట్టిన వ్యక్తి నా గురించి మాట్లాడుతున్నాడు. కొడంగల్‌లో ఓడిపోయావు. పాలమూరు ఎంపీగా ఎందుకు పోటీ చేయలేదు. సీమాంధ్రుల ఓట్ల కోసం మల్కజ్‌గిరిలో పోటీ చేశావు. కాంగ్రెస్‌లోకి వచ్చి మాకు నీతులు చెబుతున్నావు. నీలాంటి వాడితో మేము చెప్పించుకోవాలా అని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : మునుగోడు ఉపఎన్నిక… తెరపైకి కోత్త డిమాండ్లు…
పీసీసీ చీఫ్ అయ్యాక ఇంటికి వస్తా అంటే వద్దు అన్నా. జైలుకు వెళ్లి వచ్చినవాడు ఇంటికొస్తే మురికి అవుతుందని వద్దన్నా. ఎవరినీ పండపెట్టి తొక్కుతవ్. నువ్వు ఉన్నది మూడు ఫీట్లు, నన్ను తొక్కుతావా? ఎక్కడికి వెళ్లినా జిందాబాద్ కొట్టించుకుంటావు. నిన్ను సీఎంగా తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? హుజురాబాద్ వెళ్లి ఏం చేశావు. మునుగోడుకు నువ్వు వస్తే డిపాజిట్ కూడా రాదు. నీలాంటి చిల్లర దొంగ దగ్గర పనిచేసే ప్రసక్తే లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ చచ్చిపోయింది’ అని రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి.
ఇవి కూడా చదవండి :
- త్వరలో కాంగ్రెస్ గూటికి కర్నె ప్రభాకర్! నారాయణపురంలో అనుచరులతో మీటింగ్
- బ్రాందీ షాపులో పనికి రాడు.. బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్..
- మునుగోడుపై కాంగ్రెస్ దూకుడు… మధుయాష్కీ చైర్మెన్ గా ప్రచార కమిటి
- మునుగోడు ప్రజలకు ఇక పండుగే… ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
- నిరుద్యోగులకు షాక్… సగానికి పైగా పోస్టులు వారితోనే భర్తీ !!
3 Comments