
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రత్యర్ధి పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంలో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల ముందు జరగనున్న ఈ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ అధిష్టానాలు సంబంధిత రాజకీయ వర్గాలకు ఆదేశాలు జారీ చేసాయి. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగనుండగా టీఆర్ఎస్ అభ్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారు కావాల్సి ఉంది.
Also Read : మునుగోడు ప్రజలకు ఇక పండుగే… ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
గత కొన్ని నెలలుగా మునుగోడుకు ఉప ఎన్నిక ఖాయమనే సంకేతాలు వెలువడడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగాలనుకుంటున్న ఆశావహుల రష్ ఇప్పటికే బాగా పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు రెండు దఫాలు సమావేశమై ఉప ఎన్నికల సన్నాహాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు నియోజకవర్గంలోని బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్‌లలో ఓటమి పాలైన టీఆర్ఎస్ తన ప్రతిష్టను కాపాడుకోవాలని సర్వ శక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తుంది.
Read Also : బ్రాందీ షాపులో పనికి రాడు.. బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్..
అభ్యర్థి ఎంపిక, ప్రచారం. అంచనాలు తదితర అంశాలపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. ఏమాత్రం హడావుడి చేయకుండా పకడ్బందీగా ముందుకు సాగాలనే సంకల్పంతో ఉంది. 2018 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ఓడిపోయినా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. నియోజకవర్గంలో గత మూడేళ్లుగా జరుగుతున్న సర్వేలకు తోడు తాజాగా ప్రశాంత్‌కిశోర్ బృందం సర్వేలు నిర్వహించి నివేదికలు ఇచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్‌లలో వరుస విజయాలతో బీజేపీలో కొత్త ఉత్సాహంగా పొంగుకొస్తుంది.
Also Read : మునుగోడుపై కాంగ్రెస్ దూకుడు… మధుయాష్కీ చైర్మెన్ గా ప్రచార కమిటి
దాంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాడానిక ఆపర్టీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఇక్కడ విజయం సాధించి రాష్ట్రంలో తెరాసకు తామే ప్రత్యామ్నాయమన్న సంకేతాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లా కాకుండా అగ్రనేతలు సహా పార్టీ తన బలాలు, బలగాల్ని ప్రచారానికి దించే అవకాశాలు ఉన్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం.
ఇవి కూడా చదవండి :
- త్వరలో కాంగ్రెస్ గూటికి కర్నె ప్రభాకర్! నారాయణపురంలో అనుచరులతో మీటింగ్
- మోడీ పిలుపు… మారుతున్న సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్
- 188 కోట్ల నిధులతో మెరుగు పడనున్న ప్రధాన లింకు రోడ్లు
- నిజామాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్… భయాందోళనలో ప్రజలు
- తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రి… ఎప్పుడు, ఎక్కడ ??
4 Comments