
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ : మహాదేవ్ పూర్ మండలం పెద్దంపేట వాగు వద్ద విషాదకర ఘటన చోటు చేసుకున్నది, పెద్దంపేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కలిసి సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలోని వాగులోకి కలిసి వెళ్లగా ప్రమాదవశాత్తు ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు, అందులో ఇద్దరు యువకులు బయటపడగా మేసినేని అఖిల్ (17) అనే యువకుడు నీట మునిగి మృతి చెందాడు, స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానికుల సహాయంతో నీటిలో నుంచి వెలికి తీశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకున్నది, పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని మహాదేవ్ పూర్ సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు మహాదేవ్ పూర్ ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి…
- మునుగోడు ఉపఎన్నిక… తెరపైకి కోత్త డిమాండ్లు…
- నిరుద్యోగులకు షాక్… సగానికి పైగా పోస్టులు వారితోనే భర్తీ !!
- మునుగోడు ఉప ఎన్నిక… మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం
- త్వరలో కాంగ్రెస్ గూటికి కర్నె ప్రభాకర్! నారాయణపురంలో అనుచరులతో మీటింగ్..