
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు లక్ష వరకు ఖాళీలను దఫదఫాలుగా భర్తీ చేస్తామని కొన్ని నెలల కిందటే సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం సైతం చేశారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కొన్ని ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది, పోలీసు నియామకాలు సైతం ప్రభుత్వం చేపట్టింది. ఇదే కోవలో గ్రూప్ 4 పోస్టుల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 4 నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అయితే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా తాజాగా కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఐదు వేల మూడు వందల మందికిపైగా ఉన్న వీఆర్వోలు రోడ్డున పడ్డారు. ఉద్యోగం కోసం ఆందోళన చేస్తున్నారు. తాజాగా వీఆర్వోలకు సంబంధించి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-4 పోస్టుల్లో భాగమైన వీఆర్వోలను.. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది.
Also Read : మునుగోడు ఉప ఎన్నిక… మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం
రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న వీఆర్వోలను ఆశాఖ మినహా మిగతా శాఖల్లోని ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలంటూ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్రంలో 9 వేలకు పైగా గ్రూప్ 4 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీఆర్వోలను సర్దు బాటు చేస్తే ఇక మిగిలేది కేవలం 4 వేల పోస్టులే. ఇదే ఇప్పుడు నిరుద్యోగుల ఆగ్రహనికి కారణమైంది. ఐదు వేల మందికిపైగా ఉన్న వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేస తమకు మిగిలే పోస్టులు ఎన్ని అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 ఉద్యోగాల మొత్తానికి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీఆర్వోల సర్దుబాటు చేసేందుకు కొత్తగా పోస్టులు స్పష్టించాలని సూచిస్తున్నారు.
Read Also : త్వరలో కాంగ్రెస్ గూటికి కర్నె ప్రభాకర్! నారాయణపురంలో అనుచరులతో మీటింగ్
ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో వీఆర్‌వోలను సర్దుబాటు చేసే ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. జిల్లాల వారీగా ఉన్న నాన్‌టీచింగ్ ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేసేవిధంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులమేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఆ దిశగా ఇప్పటికే జిల్లాల వారీగా వీఆర్‌వోల నియామకానికి సంబంధించిన కసరత్తును ప్రారంభించారు.నేడో రేపో వారికి నియామక ఉత్తర్వులు కూడా ఇవ్వనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. జిల్లాల వారీగా కాలేజీల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ల నుండి ఇంటర్ విద్యకు అందాయి.ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఉన్న ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్లుగా కేటాయింపులు జరుపుతున్నారు. 300 నుంచి 400 వరకు..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలిపి దాదాపు 300 నుంచి 400 వరకు ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఖాళీ పోస్టుల్లో 28 మందిని టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా నియమించినట్లు లిస్టును తయారు చేశారు. అలాగే ఇతర జిల్లాల్లోని ఖాళీ పోస్టుల్లోనూ వీఆర్‌వోలను ఇదేవిధంగా సర్దుబాటు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- బ్రాందీ షాపులో పనికి రాడు.. బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్.
- మునుగోడుపై కాంగ్రెస్ దూకుడు… మధుయాష్కీ చైర్మెన్ గా ప్రచార కమిటి
- మునుగోడు ప్రజలకు ఇక పండుగే… ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
- అల్-జవహరీ కొసం ఆరునెలల నిఘా.. ఆపై రహస్య యుద్ధం..
- కన్నతల్లిపై కొడుకు కర్కశం.. ఆస్తి కోసం అమానుషం.